Sukumar: టాలీవుడ్ డైరెక్టర్లలో క్రియేటివ్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న సుకుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈయన దర్శకత్వంలో ఎంతో విభిన్నమైన చిత్రాలు తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద మంచి విషయాలను అందుకున్నాయి. ఇకపోతే తాజాగా ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో మనకు తెలిసిందే.

పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమా డైరెక్టర్ సుకుమార్ కు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మంచి మార్కెట్ తీసుకు వచ్చింది. ఈ క్రమంలోనే ఈయన రెమ్యూనరేషన్ విషయంలో కూడా భారీగా మార్పులు చేసినట్లు తెలుస్తోంది.గతంలో సుకుమార్ ఒక్కో సినిమాకు 16 నుంచి 18 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకునే వారు.

పుష్ప సినిమా మంచి విజయం అందుకోవడంతో ఈయన తన రెమ్యూనరేషన్ భారీగా పెంచారు. ఒకప్పుడు దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే డైరెక్టర్లలో రాజమౌళి మొదటి స్థానంలో ఉండగా ఆ తర్వాత స్థానంలో శంకర్ ఉండేవారు. అయితే ఇప్పుడు రెండవ స్థానంలోకి సుకుమార్ చేరినట్టు తెలుస్తోంది.

కళ్లు చెదిరే రెమ్యూనరేషన్…
పుష్ప సినిమా మంచి విజయం అందుకోవడంతో పుష్ప 2 కోసం సుకుమార్ ఏకంగా 40 కోట్ల పారితోషికం డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా పై ప్రతి ఒక్కరు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు.ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని కనుక అందుకుంటే సుకుమార్ రెమ్యూనరేషన్ మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం దక్షిణాది సినీ ఇండస్ట్రీలో ఎక్కువ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకునే వారిలో సుకుమార్ కూడా చేరిపోయారు.





























