Ntr: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకరు. ఈయన హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నారు. ఇటీవల పాన్ ఇండియా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి పాన్ ఇండియా ట్యాగ్ కూడా సొంతం చేసుకున్నారు. ఇలా నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఎన్టీఆర్ కేవలం నటుడిగా మాత్రమే కాదు గొప్ప డాన్సర్ అనే విషయం కూడా మనకు తెలిసిందే.

నటనపరంగా ఎన్టీఆర్ ఎంతో అద్భుతంగా నటిస్తారు. ఇక ఎలాంటి కష్టమైనా డైలాగ్స్ అయినా సింగిల్ టేక్ లో పూర్తిచేస్తారు. అలాగే డాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన డాన్స్ చేశారు అంటే ఆయన కాళ్ళ వంక అలాగే చూడాలనిపిస్తుంది అంత అద్భుతంగా డాన్స్ చేస్తారు అయితే ఇలా ఒక నటుడిగా డాన్సర్ గా మాత్రమే కాకుండా ఈయనలో గొప్ప సింగర్ కూడా దాగి ఉన్నారనే సంగతి మనకు తెలిసిందే.
ఎన్టీఆర్ ఎంతో అద్భుతంగా పాటలు పాడుతారు ఈయన ఇప్పటివరకు ఆరు సినిమాలలో ఆరు పాటలు పాడారు అయితే ఈయన పాడిన పాటలన్నీ కూడా ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. మరి ఎన్టీఆర్ ఏ సినిమాలో ఏ పాట పాడారనే విషయాన్ని వస్తే.. యమదొంగ సినిమాలో ఓలమ్మి తిక్క రేగిందా అనే పాటను ఎన్టీఆర్ పాడారు అదే విధంగా కంత్రి సినిమాలో వన్ టూ త్రీ నేనొక కంత్రి అనే టైటిల్ సాంగ్ పాడారు.
ఆరు పాటలు పాడిన తారక్..
ఎన్టీఆర్ నటించిన రభస సినిమాలో అచ్చమైన ఆడపిల్లల అనే పాటను పాడారు ఇక నాన్నకు ప్రేమతో అనే సినిమాలో ఫాలో ఫాలో సాంగ్ పాడారు. ఇక అదుర్స్ సినిమాలో కూడా ఎన్టీఆర్ ఓ పాటను పాడారు ఇలా ఈ తెలుగు సినిమాలకు మాత్రమే కాకుండా కన్నడలో దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ నటించిన ఓ సినిమాకి కూడా ఎన్టీఆర్ పాట పాడారు. ఇలా ఎన్టీఆర్ పాడిన పాటలన్నీ మంచి సక్సెస్ కావడంతో ఈయనలో గొప్ప సింగర్ కూడా దాగి ఉన్నారు అంటూ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.






























