Sobha Shetty: బిగ్ బాస్ దత్త పుత్రికగా పేరు సంపాదించుకొని బిగ్ బాస్ హౌస్ లో కొనసాగుతూ ఉన్నటువంటి శోభా శెట్టి ఈరోజు ఎలిమినేట్ కాక తప్పదని తెలుస్తుంది. ఇప్పటికే ఈమె ఎలిమినేషన్ గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. బిగ్ బాస్ కార్యక్రమంలోకి కంటెస్టెంట్ గా అడుగుపెట్టినటువంటి శోభ మొదటి నుంచి కూడా హౌస్ లో తోటి కంటెస్టెంట్లపై పెద్ద ఎత్తున అరుస్తూ రచ్చ చేస్తూ వచ్చారు. దీంతో ఈమెకు నెగిటివిటీ పెరిగిపోయింది.

బిగ్ బాస్ హౌస్లో ఉన్నటువంటి ఈమె శోభా శెట్టిలా కాకుండా ఏకంగా మోనిత లాగా చాలా క్రూరత్వాన్ని ప్రదర్శించారు. ఈ క్రమంలోనే తన ఆట తీరుపై ఎంతోమంది నెగిటివ్ కామెంట్లు చేయడమే కాకుండా ఈమెను వీలైనంత త్వరగా హౌస్ నుంచి పంపించాలి అంటూ తక్కువ ఓట్లు వచ్చినప్పటికీ బిగ్ బాస్ మాత్రం ఈమెను సేవ్ చేస్తూ 14 వారాల వరకు తీసుకువచ్చారు.
ఇక ఈవారం శోభ హౌస్ లో మరింత క్రూరంగా వ్యవహరించడంతో ఈమెను తప్పనిసరిగా బయటకు పంపించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో ఈ వారం శోభా శెట్టి హౌస్ నుంచి బయటకు రాబోతున్నారు. ఇక శోభ శెట్టి ఎలిమినేట్ కావడంతో ఈమె 14 వారాల పాటు హౌస్ లో కొనసాగినందుకు తీసుకుంటున్నటువంటి రెమ్యూనరేషన్ గురించి వార్తలు వైరల్ అవుతున్నాయి.
వారానికి రెండు లక్షలు…
శోభ ఈ కార్యక్రమానికి వెళ్లేముందు వారానికి రెండు లక్షల రూపాయలు చొప్పున బిగ్ బాస్ నిర్వాహకులతో కమిట్మెంట్ కుదుర్చుకున్నారట దీంతో 14 వారాలపాటు హౌస్ లో కొనసాగినటువంటి ఈమె 28 లక్షల రూపాయలను రెమ్యూనరేషన్ గా తీసుకున్నారని తెలుస్తుంది. ఇలా ఇప్పటివరకు బిగ్ బాస్ హౌస్ లో హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకున్నటువంటి కంటెస్టెంట్గా శోభ శెట్టి ఉన్నారని చెప్పాలి. ఇక ఈమె ఎలిమినేట్ కావడంతో ఫైనల్లో అమర్ శివాజీ ప్రశాంత్ అర్జున్ ప్రియాంక ఉండబోతున్నారని , యావర్ మిడ్ వీక్ ఎలిమినేషన్ ద్వారా బయటకు రాబోతున్నారని తెలుస్తోంది.

































