Sukumar: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన సుకుమార్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఇంతకాలం టాలీవుడ్ కి మాత్రమే పరిమితమైన సుకుమార్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో డైరెక్టర్ గా పాపులర్ అయ్యాడు. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక జంటగా నటించిన పుష్ప సినిమా ఊహించని విధంగా పాన్ ఇండియా లెవెల్ లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది.

ముఖ్యంగా నార్త్ ప్రేక్షకులను ఈ సినిమా బాగా ఆకట్టుకుంది. ఇదిలా ఉండగా గతంలో బాలకృష్ణ ,చిరంజీవి గురించి సుకుమార్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. సుకుమార్ తన ఇంట్లో ఒకవైపు చిరంజీవి ఫోటోని మరొకవైపు బాలకృష్ణ ఫోటోని పెట్టినట్లు ఒక షో లో వెల్లడించాడు. అయితే అందుకు పెద్ద కారణం ఉందని తెలిపాడు.

సుకుమార్ కుటుంబంలో ఉన్న నలుగురు అన్న దమ్ములలో పెద్దన్నయ్య బాలకృష్ణకి ఫ్యాన్ కాగా.. రెండు, మూడవ అన్నయ్యలు చిరంజీవి ఫ్యాన్స్. పెద్దన్నయ్యకు ఇష్టం కాబట్టి బాలయ్య ఫోటో ఓవైపు.. మిగతా ఇద్దరు అన్నయ్యల కోసం మరోవైపు చిరంజీవి ఫోటో ఇంట్లో పెట్టుకున్నాడని తెలిపాడు. ఇక వీరిద్దరిలో ఎవరీ సినిమా రిలీజ్ అయిన ఆరోజు ఇంట్లో పెద్ద సందడి ఉంటుందని సుకుమార్ తెలిపాడు.
Sukumar: పుష్ప 2 పనులలో బిజీగా సుకుమార్…
ఇదిలా ఉండగా ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ పనులలో సుకుమార్ బిజీగా ఉన్నాడు. పుష్ప సినిమా మొదటి భాగం పాన్ ఇండియా లెవెల్ లో సూపర్ హిట్ అవటంతో పుష్ప 2 మీద ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ క్రమంలో ప్రేక్షకుల అంచనాలకు చేరువయ్యేలా సుకుమార్ మొదటి పార్ట్ కన్నా రెండవ పార్ట్ కోసమే ఎక్కువ కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ జోరుగా కొనసాగుతోంది. తాజాగా అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా విడుదలైన టీజర్ కి ప్రేక్షకుల రోమాలు నిక్కబొడుచుకున్నాయి. పుష్ప 2 కోసం ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.





























