Movie News

Alludu Garu Movie : బాలకృష్ణ రెజెక్ట్ చేసిన సినిమాతో మోహన్ బాబు సూపర్ హిట్ కొట్టారని మీకు తెలుసా?

Alludugaru Movie: టాలీవుడ్‌లో కలెక్షన్ కింగ్‌గా పాపులారిటీ సంపాదించుకున్న నటుడు మంచు మోహన్ బాబు. గురువు గారు దర్శకరత్న దాసరి నారాయణ రావు అండదండలతో చిన్న వేశాలతో సినిమా ఇండస్ట్రీలో కెరీర్ ప్రారంభించిన మోహన్ బాబు అగ్ర కథానాయకుడిగా, నిర్మాతగా ఇప్పటికీ ఓ వెలుగు వెలుగుతున్నారు. ఆయన ఒక్కసారి నిర్ణయం తీసుకున్నారంటే అది ఎంతటిదైనా చేసేయాల్సిందే. కాదు కూడదు అనేది ఆ తర్వాత మోహన్ బాబు నోటి నుంచి వచ్చేది కాదు. అది ఇప్పటికీ మారలేదు. హీరోగా మాత్రమే నటించాలని ఏనాడు అనుకోలేదు మోహన్ బాబు. మనసుకు నచ్చిన పాత్ర ఏది ఇచ్చినా చేయడానికి సిద్దంగా ఉండేవారు. అది విలన్ పాత్రైనా, కామెడీ పాత్రైనా, కౄరంగా ఉండే పాత్రైనా సరే సై అనేవారు.

Mohan Babu – Raghavendra Rao: రాఘవేంద్రరావు మోహన్ బాబును నిలబెట్టిన అల్లుడుగారు సినిమా రీమేక్ సినిమా అని తెలుసా?

అయితే ఒకానొక సమయంలో మోహన్ బాబు వరుస ప్లాప్ లను ఎదుర్కొన్నారు. దాంతో మోహన్ బాబు ఇక సినిమాలు మానేస్తే మంచిదేమో అని మాట్లాడుకున్నారు. ఎలాగైనా హిట్ కొట్టాలనే ఉద్దేశంతో ఉన్న మోహన్ బాబు తనతో సినిమా చేయమని దర్శకేంద్రుడు కే. రాఘవేంద్ర రావును అడిగారు. ఆ తరువాత వరుస ప్లాపులతో రాఘవేంద్ర రావు కెరీర్ కాస్త డౌన్ అయింది. ఈ క్రమంలో అయన కెరీర్ నిలేబెట్టుకునే ప్రయత్నంలో మెగాస్టార్ చిరంజీవితో ‘జగదీకవీరుడు అతిలోక సుందరి’ సినిమా చేస్తున్నారు. అందువల్ల ఆ సినిమా పూర్తయ్యే వరకు వెయిట్ చేయమని రాఘవేంద్ర రావు చెప్పడంతో.. మరో డైరెక్టర్ తో ఈ సినిమా చేద్దామని అనుకున్నారు మోహన్ బాబు.. కానీ మోహన్ బాబు వరుస ప్లాపులలో ఉండటంతో ఆయనతో సినిమా చేయడానికి మరో డైరెక్టర్ ముందుకు రాలేదు.. దీనితో ‘జగదీకవీరుడు అతిలోక సుందరి’ సినిమా రిజల్ట్ కోసం వెయిట్ చేయాల్సి వచ్చింది. ఆ సినిమా సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. ఆ తరువాత రమ్య కృష్ణ, మోహన్ బాబు జంటగా ‘అల్లుడుగారు’ చిత్రాన్ని ప్రకటించారు కే.రాఘవేంద్ర రావు. మోహన్ బాబు సొంతంగా తన బ్యానర్ లో ఈ చిత్రాన్ని నిర్మించారు.

Mohan Babu – Raghavendra Rao: రాఘవేంద్రరావు మోహన్ బాబును నిలబెట్టిన అల్లుడుగారు సినిమా రీమేక్ సినిమా అని తెలుసా?

ఇక ఈ సినిమా షూటింగ్ పనులను ప్రారంభించిన తర్వాత కూడా ఈ సినిమా ఖచ్చితంగా ఫ్లాప్ అవుతుందని ఎంతోమంది భావించి ఈ సినిమాని ఆపేయాలని దర్శకుడికి సలహా కూడా ఇచ్చారు. కానీ రాఘవేంద్రరావు ఎంతో కసితో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అప్పట్లో ఏ మాత్రం అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకొని అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ సినిమా తర్వాత మోహన్ బాబు వెనుతిరిగి చూసుకోలేదు.

మలయాళ రీమేక్ చిత్రం…


ఇలా బాక్సాఫీస్ వద్ద ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్న అల్లుడుగారు సినిమా మలయాళ రీమేక్ చిత్రం అనే విషయం చాలా మందికి తెలియదు. ఈ సినిమా 1988లో మలయాళంలో ‘చిత్రం’ సినిమాకి రీమేక్ గా తెరకెక్కింది. ఇందులో మోహన్ లాల్ రంజని ప్రధాన పాత్రలలో నటించారు. ప్రియదర్శన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా 300 రోజులు ప్రదర్శితమైన మోహన్ లాల్ సినీ కెరీర్ లోనే ది బెస్ట్ సినిమాగా నిలిచిపోయింది. ఈ చిత్రం రిమేక్ హక్కులను హీరొయిన్ సుహాషిని మేనేజర్ తీసుకుని నందమూరి బాలకృష్ణతో ఈ సినిమా చేయాలని భావించారు. అయితే బాలకృష్ణ కు ఈ సినిమా కథ నచ్చకపోవడంతో అయన వద్దనుకున్నారు. దాని తరువాత ఈ సినిమా రైట్స్ మోహన్ బాబు చేతుల్లోకి వెళ్ళాయి. ఇలా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకున్న ఈ సినిమాని తెలుగులో అల్లుడుగారు చిత్రంగా తెరకెక్కించి మంచి విజయాన్ని అందుకున్నారు. అందుకే మోహన్ బాబు ఇండస్ట్రీలో దర్శకరత్న దాసరి, దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావును తన గురువులుగా భావిస్తారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago