Categories: Featured

kinnera mogilaiah : వెయ్యి రూపాయిలు లేక భార్య, కొడుకు చనిపోయారు.. నల్లమల నుంచి ఢిల్లీ వరకు.. మొగులయ్య ప్రస్థానం లో ఎన్నో ఆటుపోట్లు..!

కిన్నెర కళాకారుడు మొగులయ్య.. మొన్నటి వరకు ఈయన ఎవరు అన్నది ఎవరికి తెలియదు. కానీ ఇప్పుడు మాత్రం మొగులయ్య ఒక గొప్ప కళాకారుడు అని దేశం మొత్తం చర్చ జరుగుతోంది. ఎంతో ప్రతిభ ఉన్నప్పటికీ తెరమీదకి రాని మొగులయ్య ఒకే ఒక్క పాటతో ఎంతో ఫేమస్ అయిపోయారు. 12 మెట్ల కిన్నెర వాయిస్తూ ఆయన పాడే పాట ప్రతి ఒక్కరిని మంత్రముగ్ధుల్ని చేస్తుంది అని చెప్పాలి. ఉయ్యాలలో పసిపాప నిద్రపోయేటప్పుడు తల్లి పడుతున్న జోల పాటలా.. చెట్టు కింద సేదతీరుతున్నప్పుడు అందరినీ మైమరిపించే పల్లె పాటలా మొగులయ్య గానం వుంటుంది. మొన్నటి వరకు నల్లమల్ల కి మాత్రమే పరిమితమైన ఈయన గానం ఇక ఇప్పుడు ఢిల్లీ వరకు వెళ్ళింది. కిన్నెర కళాకారుడు మొగులయ్య కు పద్మశ్రీ అవార్డు వరించింది.

ఇక మొగులయ్య కు పద్మశ్రీ అవార్డు దక్కడంతో ప్రస్తుతం ఈయన గురించి తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరూ మీడియాలో వెతకడం ప్రారంభించారు. ఇక కాస్త వివరాల్లోకి వెళితే ఒకప్పుడు కిన్నెర కు కేవలం ఆరు మెట్లు మాత్రమే ఉండేవి కానీ మొగులయ్య కళ మీద ఆసక్తితో ఏకంగా 12 మెట్ల వాయిద్యాన్ని ప్రత్యేకంగా తయారు చేసాడు. నాగర్కర్నూల్ జిల్లా లింగాల మండలం అవుసలి కుంట కు చెందిన మొగులయ్య అంతరించిపోతున్న కళకు ఊపిరి పోయడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. జానపద గాథ లైన పండుగ సాయన్న కథ, సీతమ్మ పర్ణశాల, పానుగంటి మియాసాబ్, పిల్ల జాతర లాంటి ఎన్నో పాటలు పాడి రాష్ట్రవ్యాప్తంగా ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్నారు మొగులయ్య.

ఆయన కిన్నెర పట్టుకుని వీరగాథలు చెబుతుంటే ప్రతి ఒక్కరిలో పౌరుషం ఉప్పొంగి పోతూ ఉంటుంది. ఇక ఆయన పాటలు పాడుతుంటే ప్రతి ఒక్కరి మనసు పలకరించి పోతుంది. అయితే ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని కిన్నెర కళలను బ్రతికించడమే లక్ష్యంగా ముందుకు సాగారు మొగులయ్య. ఈ క్రమంలోనే తెలుగు యూనివర్సిటీకి చెందిన రీసెర్చ్ స్కాలర్ దాసరి రంగా మొగులయ్య ప్రతిభను గుర్తించి ఆయనను ప్రోత్సహించడం మొదలుపెట్టారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా కిన్నెర కలకు గుర్తింపు తీసుకు వచ్చేందుకు ప్రదర్శనలు ఇవ్వడం మొదలుపెట్టారు మొగులయ్య. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన భీమ్లా నాయక్ సినిమాలో టైటిల్ సాంగ్ పాడి ఒక్కసారి గా గుర్తింపు సంపాదించారు. ఆడ గాదు ఈడ గాదు అమీరొళ్ల మెడ కాదు అంటూ మొగులయ్య పాడిన పాట ప్రతి ఒక్క ప్రేక్షకుడిని కూడా సరికొత్త లోకంలోకి తీసుకెళ్ళింది అని చెప్పాలి.

తాత ముత్తాతల నుంచి మొగులయ్య కుటుంబం కిన్నెర కళ పైనే ఆధార పడుతూ జీవనోపాధి పొందుతు ఉంది. కానీ ఆ తర్వాత కాలంలో మాత్రం ఈ కళను నేర్చుకునేందుకు ఎవరూ ఆసక్తి చూపలేదు. కానీ తాను బ్రతికి ఉన్నంత వరకు కిన్నెర కళను బ్రతికిస్తాను అంటూ కంకణం కట్టుకున్నారు మొగులయ్య. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా కిన్నెర కళను మాత్రం వదిలిపెట్టలేదు.

వెయ్యి రూపాయ‌లు లేక మొగులయ్య భార్య చ‌నిపోయింది. కళ కోసం ఆమెను హైద‌రాబాద్ తీసుకువ‌చ్చిన మొగులయ్య.. ఆఫీసుల చుట్టూ తిరిగిన పరిస్థితి.. మొగిలయ్య పాటూ హైదరాబాద్ వచ్చిన ఆమె స‌రిగా తిండి లేక చివరికి చేనిపోయింది. చనిపోయిన భార్య శ‌వాన్ని ఊరు తీసుకెళ్లేందుకు కూడా రూపాయి గ‌తి లేని పరిస్థితి. ఇక మొగులయ్యకు తొమ్మిది మంది పిల్ల‌లు. ఒక కొడుకు ఆరోగ్గుంయం బాగోకపోతే డాక్టర్లు గుండెలో నీరొచ్చిందన్నారు. హైద‌రాబాద్ తీసుకెళ్ల‌మ‌న్నారు సూచించారు.. కానీ రూ.500 లేక అత‌డు చ‌నిపోయాడు. నిరుపేద కుటుంబానికి చెందిన మొగులయ్య కు ఆర్థిక ఇబ్బందుల కారణంగా అనారోగ్యంతో భార్య కుమారులు ఒక్కొక్కరుగా మరణించిన ఎన్ని సవాళ్లు ఎదురైనా కిన్నెర కలను మాత్రం వీడకుండా ముందుకుసాగారు. ఇక ఇప్పుడు ఏకంగా నల్లమల నుంచి ఢిల్లీ వరకూ గుర్తింపు సంపాదించారు మొదలయ్య.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago