Nayanathara wedding:దక్షిణాది సినీ ఇండస్ట్రీలో గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రేమపక్షులుగా వ్యవహరిస్తున్నటువంటి నయనతార విగ్నేష్ ఎట్టకేలకు నేడు వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు.దాదాపు ఏడు సంవత్సరాల నుంచి ప్రేమలో విహరిస్తున్న ఈ జంట వీరు పెళ్లి గురించి ఎప్పుడు అడిగినా ఆ ప్రశ్నలు దాటేస్తూ సస్పెన్స్ పెట్టారు.ఈ క్రమంలోనే నేడు హిందూ సాంప్రదాయ పద్ధతిలో బంధువులు అతిథులు కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది.

నేడు ఈ జంట ఉదయం 8.30 గంటలకు షెరటాన్ గ్రాండ్, మహాబలిపురంలో షెరటాన్ గ్రాండ్‌లో జరిగింది. ఇకపోతే వీరి పెళ్ళికి కోలీవుడ్ సెలబ్రిటీలతో పాటు పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు అలాగే రాజకీయ నాయకులు కూడా హాజరైనట్లు సమాచారం. పెళ్లికి నయనతార ధరించిన నగలు డైమండ్ రింగ్ తో సహా దాదాపు 5 కోట్ల విలువ చేసే నగలు ధరించారని తెలుస్తోంది. ఇక ఈమె పెళ్లి కోసం ప్రత్యేకంగా బంగారు దారాలతో తయారు చేయించుకున్న గద్వాల పట్టు చీరలు కట్టుకున్నారట. ఈ చీర ఖరీదు దాదాపు 5 లక్షల వరకు ఉంటుందని సమాచారం.

ఇకపోతే నయనతార తన భర్తకు పెళ్ళికి కానుకగా ఖరీదైన బహుమతిని కట్నం కింద ఇచ్చారని తెలుస్తోంది. చెన్నైలోని కాస్ట్లీ ఏరియాలో నయనతార ఎంతో విలాసవంతమైన ఇంటిని వీరి అభిరుచులకు అనుగుణంగా డిజైన్ చేయించి ఆ ఇంటికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా తన భర్త విగ్నేష్ పేరుపై రాసి తనకు కానుకగా ఇచ్చారని తెలుస్తోంది.
నెట్ ఫ్లిక్ లో ప్రసారం కానున్న నయన్ విగ్నేష్ పెళ్లి వేడుక..
ఈ విధంగా వీరిద్దరూ పెళ్లి కోసం భారీ మొత్తంలోనే ఒకరికొకరు కానుకలు సమర్పించుకొన్నారని తెలుస్తోంది. ఇక పోతే వీరి పెళ్లి మహాబలిపురంలో జరిగినప్పటికీ రిసెప్షన్ మాత్రం ఫైవ్ స్టార్ హోటల్లో ఎంతో ఘనంగా నిర్వహించనున్నారని తెలుస్తోంది.అయితే ప్రస్తుతం నయనతార పెళ్లికి సంబంధించిన ఈ విషయాలన్నీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి .అయితే వీరి పెళ్లికి సంబంధించిన ఎలాంటి ఫోటోలు వీడియోలు బయటకు రాకుండా ఈ జంట ఎంతో అప్రమత్తమయ్యారు. ఇకపోతే వీరి పెళ్లి వేడుకను ఏకంగా నెట్ ఫ్లిక్ కి 2.5 కోట్ల రూపాయలకు అమ్మినట్టు తెలుస్తోంది. త్వరలోనే వీరి పెళ్లి నెట్ ఫ్లిక్ లో ప్రసారం కానుంది.



























