Anushka: సూపర్ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యారు నటి అనుష్క శెట్టి.మొదటి సినిమాతోనే ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనుష్క అనంతరం పలు సినిమాలలో నటిస్తూ మంచి పేరు సంపాదించారు.ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లోనే ఈమె అరుంధతి వంటి లేడీ ఓరియంటెడ్ చిత్రం ద్వారా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన రికార్డు సృష్టించారు.

ఈ సినిమాతో అనుష్కకు ఇండస్ట్రీలో వరుస అవకాశాలు వచ్చాయి. ఒకవైపు కమర్షియల్ చిత్రాలలో నటిస్తూనే మరోవైపు లేడీ ఓరియంటెడ్ చిత్రాల ద్వారా పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేశారు. ఇకపోతే ప్రస్తుతం ఈమె సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ ఇంకా సినిమా షూటింగులో పాల్గొన లేదు. బాహుబలి సినిమా తర్వాత అనుష్క ఇండస్ట్రీకి దూరమయ్యారు.

ఇకపోతే తాజాగా ఈమె నవీన్ పోలిశెట్టి హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పనులు ప్రారంభమైనప్పటికీ స్వీటీ ఇంకా షూటింగ్ లొకేషన్లోకి అడుగుపెట్టలేదు. ఇకపోతే సెలెబ్రిటీల అంటేనే వారి దగ్గర ఎంతో ఖరీదైన కార్లు ఉంటాయి. ఈ క్రమంలోనే అనుష్క దగ్గర కూడా ఎంతో ఖరీదైన కార్లు ఉన్నాయని తెలుస్తోంది.
ఖరీదైన కార్లను కొనుగోలు చేసిన అనుష్క
ఈమె హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా టయోటా కరోలా ఆల్టిస్ కారు కొనుగోలు చేశారు. దీనితోపాటు అనుష్క దగ్గర బీఎండబ్ల్యూ 6 సిరీస్ కారు ఉంది దీని విలువ దాదాపు 70 లక్షల వరకు ఉంటుంది. అలాగే ఆడి ఏ6 ఒకటి కాగా ఈ కారు విలువ 60 లక్షల రూపాయలు, అత్యాధునిక ఫీచర్లు కలిగినటువంటి ఆడి క్యూ5 ఈ కారు ధర సుమారు 60 లక్షల వరకు విలువ చేస్తుంది. అనుష్క దగ్గర సుమారు రెండు కోట్లకు పైగా విలువ చేసే కార్లు ఉన్నాయని తెలుస్తోంది.



























