తెలంగాణాలో ఇంటి యజమానులకు కేసీఆర్ హెచ్చరించారు.. అద్దెకు ఉండేవారిని మూడు నెలల వరకు ఇంటి అద్దె ఇవ్వమని ఒత్తిడి చేయవద్దని స్పష్టం చేసారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఇది మార్చి, ఏప్రిల్, మే నెలకు ఇల్లు అద్దె గురించి వర్తిస్తుందని తెలిపారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో కిరాయిదారుల నుంచి అద్దె వసూలు చేయవద్దని, మూడు నెలలు వాయిదా వేసి ఆ తరువాత కూడా వాయిదా పద్దతిలో తీసుకోవాలని సూచించారు.
రాష్ట్రంలో లాక్ డౌన్ అమలులో ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం అందరికి పనులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇటువంటి సమయంలో వారిని అద్దెలు చెల్లించమని అడగడం సరికాదని, వారికి కూడా అద్దెలు చెల్లించే పరిస్థితి ఉండదు కాబట్టి ఇంటి యజమానులు అద్దె కోసం వారిని వత్తిడి చేయడడానికి వీలులేదని తెలిపారు. ఇది విజ్ఞప్తి కాదు రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అధికారం అని చెప్పారు. ఒకవేళ ఎవరైనా ఇంటి ఓనర్లు అద్దె కట్టమని ఇబ్బంది పెడితే 100 కు డయల్ చేయండి. వెంటనే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. అలాగే అద్దె వసూలు చేయడం లేదు కదా అని తరువాత వడ్డీ వసూలు చేయొద్దని స్పష్టం చేసారు సీఎం కేసీఆర్.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…