ప్రముఖ నిర్మాత, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత డాక్టర్ డి.రామానాయుడు వివిధ భారతీయ భాషల్లో అత్యధిక సినిమాలు నిర్మించిన నిర్మాతగా ప్రపంచ రికార్డ్ సృష్టించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సాధించాడు. డి.రామానాయుడు గారు ప్రకాశం జిల్లా కారంచేడులో సాధారణ రైతు కుటుంబంలో జన్మించినప్పటికీ సినిమాల మీద ఇంట్రెస్ట్ తో 1963లో “అనురాగం” అనే సినిమాతో ఇండస్ట్రీలో నిర్మాతగా మారి అనతికాలంలోనే స్టార్ హీరోలతో సినిమాలు నిర్మించే స్థాయికి ఎదిగాడు.

రామానాయుడు గారు అనతికాలంలోనే సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ ప్రారంభించి ఈ బ్యానర్లో
మొదటి సినిమా రాముడు-భీముడు ఈ సినిమాలో ఎన్టీఆర్ హీరోగా నటించాడు.సినిమా భారీ విజయం నమోదు చేసింది. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ బ్యానర్ లో భారీ బడ్జెట్ సినిమాలు నిర్మించడమే కాకుండా ఎన్నో విలువలతో కూడిన సినిమాలను నిర్మించారు రామానాయుడు గారు.
ఆ రోజుల్లో రామానాయుడుగారు నటన మీద ఉన్న ఆసక్తితో “నమ్మిన బంటు” అనే సినిమాలో నటించాడు. రామానాయుడుగారు నిర్మాతగా తెలుగు, హిందీ,తమిళ, మలయాళ, కన్నడ, బెంగాలీ ఇలా రూపాయి నోటు మీద కనిపించే అన్నీ భాషల్లోనూ సినిమాలు తీశారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇంగ్లీష్ భాషలో కూడా సినిమాలను నిర్మించారు. నాన్న ఏ సినిమా నిర్మించిన అది విలువలతో కూడుకున్న సినిమాలను నిర్మించేవారు.
రామానాయుడు నిర్మాతగా సినీ ఇండస్ట్రీలో దాదాపు ఇరవై మంది కొత్త దర్శకులును, ఆరుగురు హీరోలను పరిచయం చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది.2015 ఫిబ్రవరి 18న రామానాయుడు తుదిశ్వాస విడిచాడు. ఇటీవలే రామానాయుడు 86వ జయంతి సందర్భంగా వంశీ గ్లోబల్ అవార్డ్స్, ఇండియా, సంతోషం ఫిలిమ్ న్యూస్, తెలుగు కళాసమితి ఆధ్వర్యంలోసంయుక్తంగా ఏర్పాటుచేసిన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో సురేష్ బాబు పలువురు సినీ పెద్దలు పాల్గొన్నారు.






























