"Jobs" on wooden block and magnifying glass on newspaper background
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు. ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన 90 ఉద్యోగాలను భర్తీ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఉత్తరాంధ్రలోని రెండు జిల్లాల్లో, కృష్ణా జిల్లాలో ఈ ఉద్యోగాల భర్తీ జరగనుంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ఆరోగ్య మిత్ర, టీం లీడర్స్ పోస్టులను జగన్ సర్కార్ భర్తీ చేయనుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆఫ్ లైన్ లేదా ఈ మెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
కృష్ణా జిల్లాలో అత్యధికంగా 62 ఉద్యోగాలు ఉండగా ఆ ఉద్యోగాలలో ఆరోగ్య మిత్ర ఉద్యోగాలు 55, టీం లీడర్స్ ఉద్యోగాలు 7 ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాలో 15 ఉద్యోగాలు ఉండగా ఆరోగ్య మిత్ర ఉద్యోగాలు 14, టీం లీడర్స్ ఉద్యోగం ఒకటి ఉన్నాయి. విజయనగరం జిల్లాలో 13 ఉద్యోగాలు ఉండగా అందులో ఆరోగ్య మిత్ర ఉద్యోగాలు 12 ఉండగా టీం లీడర్స్ ఉద్యోగాలు ఒకటి ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు ఆయా జిల్లాల వెబ్ సైట్ లను చూసి దరఖాస్తు చేసుకోవచ్చు.
కృష్ణా జిల్లాకు చెందిన అభ్యర్థులు నవంబర్ 5వ తేదీలోగా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల అభ్యర్థులు నవంబర్ 6వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. https://krishna.ap.gov.in/, https://srikakulam.ap.gov.in/, https://vizianagaram.ap.gov.in/ వెబ్ సైట్ల ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన మరింత సమాచారం తెలుసుకోవచ్చు.
విద్యార్హత, కంప్యూటర్ స్కిల్స్, ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. ఎమ్మెస్సీ (నర్సింగ్), ఎంఫార్మసీ, బీఎస్సీ(నర్సింగ్), బీఎస్సీ (ఎంఎల్‌టీ), బీఫార్మసీ, ఫార్మసీ డీ చదివిన అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా జగన్ సర్కార్ నిర్ణయాలు తీసుకుంటూ ఉండటంపై విద్యార్థులు, యువత హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…