Durgarao : టిక్ టాక్ యాప్ వల్ల ఎంతోమంది కామన్ వాళ్ళు సెలబ్రిటీస్ గా మారారు. ఇక ఆ యాప్ బ్యాన్ అయ్యాక యూట్యూబ్ షార్ట్స్, ఇంస్టాగ్రామ్ షార్ట్స్ అంటూ వీడియోలు చేస్తూ చాలామంది ఫేమస్ అవుతున్నారు. ఏకంగా టిక్ టాక్ వల్ల సినిమా అవకాశాలు, యాంకరింగ్ అవకాశాలతో దూసుకుపోతున్న వాళ్ళు ఉన్నారు. ఇక ఈ కోవకే చెందుతాడు దుర్గారావు. పాటలకు తన భార్యతో కలిసి డాన్స్ చేస్తూ బాగా ఫేమస్ అయ్యాడు. పలు టీవీ షోలకు కూడా వచ్చాడు దుర్గారావు.

బుల్లితెర పవర్ స్టార్ సుధీర్….
ఇక పలు ఇంటర్వ్యూల్లో సందడి చేస్తూ వారి టీవీ అనుభవాలను పంచుకున్న దుర్గారావు అతని భార్య జబర్దస్త్ గురించి మాట్లాడారు. టిక్ టాక్ వల్ల ఫేమస్ అయ్యాక సుధీర్ ఫోన్ చేసి జబర్దస్త్ లో గెస్ట్ గా స్కిట్స్ చేయాలని ఆహ్వానించాడట. ఇక స్టూడియోకి వెళ్ళాక అక్కడ జబర్దస్త్ వాళ్ళతో ఫోటోలు తీసుకుంటే చాలని అనుకున్నారట దుర్గారావు దంపతులు. కానీ మాకు జబర్దస్త్ లో పాల్గొనే అవకాశం ఇచ్చారు. ఇక సుధీర్ గారు మాకు కాళ్ళకు మొక్కి దండం పెట్టారు చాలా సంస్కారం గల మనిషి సుధీర్ అంటూనే వెండితెరకు పవర్ స్టార్.. పవన్ కళ్యాణ్ అయితే, బుల్లితెరకు సుధీర్ పవర్ స్టార్ అంటూ ప్రశంసించారు.

ఇక ఆయనే ఢీ షో డైరెక్టర్లను అడిగి మమ్మల్ని ఢీ షోకి తీసుకెళ్లారు అని చెప్పారు దుర్గారావు. ఇక దుర్గారావు భార్య డాన్స్ మూమెంట్ ను రవితేజ తన క్రాక్ సినిమాలోని ఒక పాటలో అనుకరించడం చాలా గొప్పగా అనిపించిందని చెప్పారు. ఇల్లు డబ్బులేక సరిగా కట్టుకోలేదని ఇంట్లో సరిగా ప్లాస్ట్రింగ్ పని కూడా చేయించలేదు. అందుకే ఒక తెర కట్టి వెనుక కనిపించకుండా డాన్స్ చేసే వాళ్ళమని అది కూడా ఒక ట్రెండ్ అయిందని చాలామంది దుప్పటి దుర్గరావు అంటున్నారని పంచుకున్నారు.



























