DVV Danayya : ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ అవార్డు రావడంతో అసలు నిర్మాత ప్రమోషన్స్ లో ఎక్కడా కనిపించకపోవడం పట్ల సర్వత్రా చర్చలు జరిగాయి. సినిమాకు నిర్మాత డివివి దానయ్య గారు కాగా అసలు ఆయన సినిమాకు నిర్మాత కాదు చిరంజీవి గారు అసలు నిర్మాత, షాడో గా ఈయనను పెట్టారు అనే వార్తలు సోషల్ మీడియాలో జోరుగా సాగడంతో చివరకు డివివి దానయ్య గారు ఈ పుకార్లకు చెక్ పెట్టడానికి యూట్యూబ్ ఛానెల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో తన పాత సినిమా విశేషాలు కొత్త ప్రాజెక్ట్స్ తో పాటు ఆర్ఆర్ఆర్ సినిమా విషయంలో వస్తున్న గాసిప్స్ గురించి మాట్లాడారు.

చిరంజీవి పెట్టుబడులు.. అవన్నీ పిచ్చి మాటలు…
దానయ్య గారు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో ఏళ్లుగా ఉన్నా ఎపుడు మీడియా కంట పడరు. చాలా తక్కువగా పబ్లిక్ కి కనిపించే దానయ్య గారు తన సినిమా ఈవెంట్స్ లో కూడా పెద్దగా మాట్లాడటం ఎక్సపోజ్ అవడం జరగదు. ఆ కారణం వల్లే ఆర్ఆర్ఆర్ సినిమా విషయంలో కూడా పెద్దగా ఆయన కనిపించలేదు. మొదటి సినిమా ‘జంబలకిడి పంబ’ దగ్గరి నుండి అల్లు అర్జున్ జులాయి, మహేష్ భరత్ అనే నేను, పవన్ తో కెమెరా మెన్ గంగ తో రాంబాబు వంటి సినిమాలు నిర్మించినా ఆయన ఎక్కడా పబ్లిసిటీ చేసుకోరు.

అయితే ఆయన గురించి ఇటీవల త్రిపుల్ ఆర్ సినిమా విషయంలో వచ్చిన రూమర్ పై ఆయన స్పందించారు. అసలు నిర్మాత చిరంజీవి అని కేవలం దానయ్య గారు షాడో అంటూ వచ్చిన పుకార్ల గురించి మాట్లాడుతూ అవన్నీ పిచ్చి మాటలు, ఆయన కొడుకుతో సినిమా తీయాలనుకుంటే ఆయనే పెడతాడు డబ్బులు నా పేరు చెప్పి ఎందుకు పెడతాడు పెట్టుబడి అంటూ ఇవన్నీ సోషల్ మీడియా కల్పించినవే అంటూ క్లారిటీ ఇచ్చారు.