Dwarampudi Chandhrashekhar Reddy : చిరు పొలిటికల్ ఎంట్రీ గురించి హాట్ కామెంట్స్ చేసి వైసీపీ ఎమ్మెల్యే…!

0
92

Dwarampudi Chandrashekhar Reddy : మెగా ఫ్యామిలీకి రాజకీయాలు కొత్త కాదు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి సీఎం కాకపోయినా అలాగే పార్టీ నిలుపుకుని ఉంటే ఖచ్చితంగా తరువాత కాలంలో సీఎం అయ్యుండేవారేమో కానీ ఒకరి చేత విమర్శలను ఎదుర్కొనలేక ఆయన రాజకీయాలు నాకు సెట్ కావు అని పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి మళ్ళీ సినిమాల వైపు వెళ్లారు. ప్రస్తుతం ఆయన రాజకీయాల గురించి కానీ, రాజకీయాలలోకి రావాలని కానీ అనుకోవడం లేదు. పవన్ కళ్యాణ్ రాజకీయాలలోకి వచ్చాక కూడా నేను మాట పడలేను అందుకే రాజకీయాలకు దూరమ్యాయను. కానీ కళ్యాణ్ అలా కాదు మాట పడగలడు, మాట అనగలడు అంటూ కామెంట్స్ కూడా చేసారు. అయితే తాజాగా వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చిరు పొలిటికల్ ఎంట్రీ గురించి హాట్ కామెంట్స్ చేసారు.

ఆయన సినిమాల్లోకి మళ్ళీ వెళ్లి మంచి పని చేసారు…

ఎపుడూ వివాదాల జోలికి వేళ్ళని చిరంజీవి తాజాగా ఏపీ ప్రభత్వానికి చురకలు వేశారు. వాళ్తేరు వీరయ్య 200 డేస్ వేడుకలో అభివృద్ధి గురించి ముందు ఆలోచించండి అంటూ వైసీపీ గవర్నమెంటును విమర్శించడంతో వైసీపీ నేతలు చిరు మీద పడ్డారు. ఆయన మీద విమర్శిసలను చేయడంతో గత కొద్ది రోజులుగా చిరు సినిమాలతో కాకుండా రాజకీయాలలో వైరల్ అవుతున్నారు.

ఆయన మళ్ళీ రాజకీయాలలోకి వచ్చి తమ్ముడి పార్టీ ద్వారా క్రియశీల రాజకీయాలు చేయాలని అనుకుంటున్నట్లు వినిపిస్తున్నా వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి ఆయన పొలిటికల్ ఎంట్రీ గురించి మాట్లాడుతూ ఆయన మళ్ళీ రాజకీయాలలోకి రాడు అంటూ చెప్పారు. పాలిటిక్స్ వదిలి సినిమాలలోకి వెళ్లి మంచి పని చేసారని, సినిమాల ద్వారా ప్రజలను ఎంటర్టైన్ చేయడం మంచి పని అంటూ చెప్పారు. ఆయనకు పాలిటిక్స్ సెట్ అవ్వవు అంటూ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి హాట్ కామెంట్స్ చేసారు.