ప్రతి చోట ప్రమాదాలు పొంచి ఉంటాయి. దేవుడు దయ తప్పించుకుంటే ఓకే లేకపోతే వాటి పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. తాజాగా ఓ షూటింగ్ జరిగిన ప్రమాదంలో కరెంట్ షాక్‌తో సహాయ ఫైటర్ మృతి చెందాడు. వివేక్ (28)జోగనదొడ్డి వద్ద షూటింగ్ చేస్తుండగా కరెంట్ షార్ట్ సర్క్యూట్ జరిగి ప్రాణాలు కోల్పోగా.. ఇద్దరు సహాయకులు గాయపడ్డారు. గాయపడ్డ వారిని బెంగళూరులోని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం తర్వాత దర్శకుడు శంకర్‌రాజ్, నిర్మాత గురుదేశ్‌పాండెను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు.

సినిమా షూటింగ్‌లో తరుచు ప్రమాదాలు జరుగుతునే ఉన్నాయి. ఇటీవలే శంకర్ తెరకెక్కిస్తున్న భారతీయుడు 2 షూటింగ్ ప్రమాదంలో భారీ క్రేన్ విరిగడంతో ముగ్గురు మృతి చెందారు. మరో 10 మందికి గాయాలయ్యాయి. కమల్ హాసన్, శంకర్, కాజల్ ఈ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు.