Ex IPS Officer Narasaiah : ఎన్టీఆర్ శత జయంతి వేడుకల సందర్భంగా ఎన్టిఆర్ గారు సినిమాల్లో నటించేటపుడు కంటే సీఎంగా ఉన్నపుడు జరిగిన ఆసక్తికర విషయాలను ఆయన చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా ఉన్న మాజీ ఐపిఎస్ నరసయ్య గారు తాజాగా ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. ఆయనలు రాజకీయం రాదంటూ అదే తెలుసుంటే ఆయన దేశానికి పీఎం అయ్యేవాడని తెలిపారు. ఆయన ఎంత భోలా మనిషో అలాగే తనతో ఉండేవాళ్లకి ఎంత ప్రాధాన్యత ఇస్తారు వంటి విషయాలను ఇంటర్వ్యులో పంచుకున్నారు.

పత్రికల్లో దారుణంగా విమర్శించారు…
ఎన్టీఆర్ గారు ముఖస్తుతికి బాగా పడిపోతారంటూ ఎన్టీఆర్ గారి వద్ద చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా పనిచేసిన నరసయ్య గారు అభిప్రాయపడ్డారు. ఆయన చుట్టూ కొంతమంది దేవుడు మీరే అంటూ భజన చేసేవారు ఉండేవారు. అలాంటి వారు ఆయనని మభ్యపెట్టేవారు. అలా ఒకసారి కందుకూరి గారి విగ్రహంకి టర్బన్ కట్టడం చూసి నేను బాగా కట్టగలను అంటూ నాతో ప్రస్తావించారు ఎన్టీఆర్ గారు. నేను సాధారణంగా చెప్పారని అనుకున్నాను. ఇక మూడు రోజుల తరువాత చెన్నై నుండి టర్బన్ లు ఒక అర డజను తెప్పించారు.

కాషాయపు రంగు బట్టలు ధరించి టర్బన్ పెట్టున్నారు. ఒక మీటింగ్ వెళ్లగా ఆయనను చూసి అందరూ ఆశ్చర్య పోయారు. రైతు సధస్సు కాబట్టి అలా వచ్చారేమో అని అందరూ అనుకున్నారు. ఇక పత్రికల వాళ్ళు అలాగే ప్రతిపక్షాలు బాగా విమర్శించాయి. ఆయన వస్త్రధారణకు ఈనాడు లాంటి పత్రికల్లో కార్టూన్ ద్వారా విమర్శించారు. విషయం అర్థమయ్యాక ఎన్టీఆర్ గారు ఎలా తీసేయాలి అని అడిగితే తలకి దెబ్బ తగిలింది కదా అని టర్బన్ కట్టడం వల్ల గాలి ఆడక మానడం లేదు అందుకే తీసేసానని మీడియాకి చెబుదాం మీరు ఇక టర్బన్ పెట్టుకోకండి అంటూ నరసయ్య గారు సలహా ఇచ్చారట. అలా ఎన్టీఆర్ గారి వ్యవహార శైలి ఉంటుందంటూ చెప్పారు.