Ex IPS officer Narasaiah : ఎన్టీఆర్ శత జయంతి వేడుకల సందర్భంగా ఎన్టిఆర్ గారు సినిమాల్లో నటించేటపుడు కంటే సీఎంగా ఉన్నపుడు జరిగిన ఆసక్తికర విషయాలను ఆయన చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా ఉన్న మాజీ ఐపిఎస్ నరసయ్య గారు తాజాగా ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. ఆయనకు రాజకీయం రాదంటూ అదే తెలుసుంటే ఆయన దేశానికి పీఎం అయ్యేవాడని తెలిపారు. ఆయన తన చుట్టూ ఉన్నవాళ్ళను బాగా చూసుకుంటారని, వాళ్ళు చెప్పినవి వినేస్తారంటూ ఆయన గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

ఇందిరా గాంధీ ఊహించలేదు…
ఎన్టీఆర్ గారు తెలుగు వారి ఆత్మాభిమానం అనే నినాదంతోనే సీఎం అయ్యారు. అయితే ఒక సినిమా ఆర్టిస్ట్ ను జనాలు ఎంత వరకు ఆదరిస్తారు అని అప్పటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ ఎన్టీఆర్ గారిని తక్కువ అంచనా వేశారు. కానీ ఆయన పార్టీ పెట్టాడం సీఎం అయిపోవడం అన్నీ జరిగి పోయాయి. అయితే ఆయన గుండె ఆపరేషన్ కోసమని అమెరికా వెళ్లి తిరిగి వచ్చేసరికి నాదెండ్ల భాస్కర్ రావు గారు కొంతమంది ఎమ్మెల్యే లను చేరదీసి ఎన్టీఆర్ ను గద్దె డిందించి ఆయన సీఎం అవ్వాలని భావించారు.

అప్పటి గవర్నర్ సహాయంతో ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు చూపించారు. ఇక బల నిరూపణ సమయానికి క్యాంపు రాజకీయాలు చెడి చివరకు ఎన్టీఆర్ మళ్ళీ సీఎం అయ్యారు. అయితే ఆయన అమెరికా వెళ్లిన సమయంలో కొంతమంది ఎమ్మెల్యేలు తప్పులు చేసారని తెలిసీ వెంటనే మళ్ళీ ఎన్నికలకు వెళ్లి గెలిచారు అంటూ నరసయ్య అప్పటి విషయాలను పంచుకున్నారు. ఇందిరా గాంధీ ఆయన సీఎం పదవిని లాక్కోవాలని చూసి ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా ఆమె మరణించినపుడు ఢిల్లీ వెళ్లి పరామర్శించి వచ్చారు ఎన్టీఆర్, అది ఆయన సంస్కారం అంటూ చెప్పారు.