Ex MP Mysura Reddy : 2019 ఎన్నికల ముందు రాష్ట్రంలో సంచలనం రేపిన హత్య కేసు వైఎస్ రాజశేఖర్ రెడ్డి తమ్ముడు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య. తన ఇంట్లోనే రాత్రి బాత్రూంలో శవమై కనిపించారు వివేకానంద రెడ్డి. ఈ హత్య మీద విచారణ తొలుత రాష్ట్ర పోలీసులు చేసినా కేసును తప్పుదోవ పట్టిస్తున్నారనే అనుమానంతో వివేకానంద రెడ్డి కూతురు సునీత గారు కోర్ట్ ను ఆశ్రయించి పక్క రాష్ట్రం అయిన తెలంగాణ సిబిఐ కి ట్రాన్సఫర్ చేయించుకున్నారు. జగన్ సొంత బాబాయ్ హత్య, రాజకీయంగా ప్రకంపణలు రేపుతున్నా ఇప్పటికీ అసలు నేరస్థులు బయటికి రాలేదు. అయితే ఈ హత్య వైసీపీ పార్టీ కి నష్టం చేకూరుస్తుందంటూ కడప నేత మైసూరా రెడ్డి కామెంట్స్ చేశారు.

రాజశేఖర్ రెడ్డి మూడు పెళ్లిళ్లు…
కడప రాజకీయాల్లో సీనియర్ నేత అయిన మైసూరా రెడ్డి గారు వైసీపీ పార్టీ గురించి జగన్ పాలన గురించి మాట్లాడారు. వివేకానంద గారు రాజశేఖర్ రెడ్డి గారికి కుడిభుజం లాగ ఉండేవారు. అలాంటి అయన మరణించడం, కేసును తేల్చకపోవడంతో జగన్ పాలన మీద ఆ ప్రభావం ఉంటుంది. ఎంత మంచి పాలన అందించినా ఆ కేసు ప్రభావం ఉంటుంది అంటూ చెప్పారు.

ఇక రాజశేఖర్ రెడ్డి గురించి ఇటీవల వస్తున్న వార్తలు గురించి మాట్లాడుతూ రాజశేఖర్ రెడ్డి గారికి విజయమ్మ కంటే ముందే ఇంకో మహిళతో పెళ్లి జరిగిందంటూ వస్తున్న వార్తల గురించి మాట్లాడుతూ అవన్నీ నాకు తెలియదని, అయినా రాజకీయాల్లో కుటుంబాల గురించి మాట్లాడటం మంచిది కాదు కానీ జగన్ కూడా పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల గురించి మాట్లాడటం మంచి పని కాదు. అలా కుటుంబ విషయాలు మాట్లాడటం రాజకీయాల్లో మంచిది కాదు అంటూ కామెంట్స్ చేసారు.