Ex Railway D.E. Narasimha Murthy : ఒక చిన్న పొరపాటు కొన్ని వందలమంది ప్రాణాలను గాల్లో కలిసేలా చేసింది. సిగ్నలింగ్ ఇచ్చే సిబ్బంది అలసత్వమే బాలసోర్ రైలు ప్రమాదనికి కారణం అయింది. 288 మంది చనిపోగా 1178 మంది గాయాలపాలైన ఈ ఘటనలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చి వెంటనే వెనక్కి తీసుకోవటం వల్ల రైలు లూప్ లైన్ లోకి వెళ్లి ముందున్న గూడ్స్ బండిని ఢీకొట్టింది. ముందున్న రెండు భోగిలు ఎగిరి పక్కనున్న ట్ట్రాక్ మీద పడగా అటుగా వస్తున్న బెంగళూరు హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్సప్రెస్ ట్రైన్ ను ఢీ కొట్టడంతో ఆ ట్రైన్ పట్టాలు తప్పింది. ఇలా మానవ తప్పిందం వల్ల కొన్ని వందల కుటుంబాల్లో విషాదం మిగలగా అసలు రైల్వే సిబ్బంది ఎలా పనిచేస్తారు, లోకో పైలట్ ల పాత్ర అందులో ఏముంటుంది లాంటి విషయాలను విశ్రాంత రైల్వే శాఖ డిప్యూటీ ఇంజనీర్ నర్సింహ మూర్తి వివరించారు.

లోకోపైలట్ బ్రేక్ వేస్తే అంతే…
ట్రైన్ నడిపే లోకో పైలట్ కి తోడు అసిస్టెంట్ లోకో పైలట్ మరొకరు ట్రైన్ ఇంజిన్ వద్ద ఉంటారు. అలానే వెనుక వైపు గార్డ్ ఉండి రైలు కి ఎటువంటి ప్రమాదం జరగకుండా చూసుకుంటారు. అయితే ట్రైన్ కి బ్రేక్ వేస్తే ముందున్న బోగీలు ఎగిరిపాడుతాయని అందుకే అసలు బ్రేక్ వేయరని మూర్తి చెప్పారు. ట్రైన్ ఆపాలని అనుకున్నపుడు స్టేషన్ ఎంతసేపటికి వస్తుందో ఆల్రెడీ తెలుసుంటుంది కనుక స్పీడ్ తగ్గించి నెమ్మదిగా ఆపడం వల్ల స్టేషన్ దగ్గరికి వచ్చాక ట్రైన్ ఆగుతుంది.

లోకో పైలట్ పని కేవలం సిగ్నల్స్ చూసుకోవడం దానికి అనుగుణంగా ట్రైన్ నడపడమే. తాజాగా జరిగిన దుర్ఘటనలో లోకో పైలట్ తప్పు లేదు సిగ్నలింగ్ లో లోపాల వల్లే జరిగింది అంటూ చెప్పారు. ఇక ప్రపంచం లోనే మనది బ్రాడ్ గేజీ అంటూ, ట్రైన్ పట్టాలకు ఇంకో ట్రైన్ పట్టాలకు మధ్య 5అడుగుల 6 అంగులాలు గాప్ ఉంటుందని, రష్యా లోనూ ఇండియాలోనే ఎక్కువ గ్యాప్ ఉంటుందని చెప్పారు.