Fans celebrating NTR Birthday : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నందమూరి నట వారసుడిగా అభిమానులకు ఎంతో చేరువ అయ్యాడు ఎన్టీఆర్. వారసుడిగా వచ్చినా తనదైన నటన తో ఇండస్ట్రీ లో టాప్ హీరోగా వెలుగుతున్నాడు. తన నటన విశ్వరూపం తో తాతకు తగ్గ మనవడు అని పేరు తెచుకున్నాడు. ఇక ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో తన నటన, హావ భావాలతో అభిమానులను పెంచుకున్నాడు. ఇటీవలే కళాతపస్వి కె విశ్వనాధ్ గారు సైతం ఆర్ ఆర్ ఆర్ సినిమా లో ఎన్టీఆర్ నటనను ప్రశంసించారు. అయితే ఈరోజు ఎన్టీఆర్ 39 వ పుట్టినరోజును జరుపుకొంటున్నారు. తమ అభిమాన హీరో పుట్టిన రోజు కావడం తో ఎన్టీఆర్ అభిమానులు ఆయన ఇంటిదగ్గరకు హంగామా చేశారు.

ఎన్టీఆర్ ఇంటివద్ద అర్ధరాత్రి అభిమానుల హడావుడి…..
టాలీవుడ్ లో టాప్ హీరో ల లో ఒకరైన ఎన్టీఆర్ నేడు 39వ పుట్టినరోజు ను జరుపుకుంటున్నారు. తమ అభిమాన హీరో ఎన్టీఆర్ పుట్టిన సందర్భంగా జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసం దగ్గర అర్ధరాత్రి అత్యుత్సాహం తో అభిమానులు అక్కడికి చేరుకొని హంగామా చేశారు. తమ అభిమాన హీరో బర్త్ డే సందర్భంగా హైదరాబాద్ కు భారీగా జూనియర్ ఫ్యాన్స్ తరలివచ్చారు. అర్ధరాత్రి తారక్ ఇంటి వద్ద నానా హంగామా చేశారు. అంతటితో ఆగకుండా ఇంటి ముందు కేక్ కట్ చేస్తూ గోల చేశారు. జై ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేస్తూ అభిమానులు, ఎన్టీఆర్ ను ఇక్కసారి ఇంటి నుంచి బయటకు రావాలని నినాదాలు చేశారు. ఇంటి ముందే డ్యాన్సులు చేస్తూ నానా రచ్చ చేశారు.
అర్ధరాత్రి అభిమానులు అతుత్సాహం తో గూమికూడడం, వారి హంగామా, అల్లరి వలన అటువైపు వెళ్తున్న వాహనదారులు, స్థానికులకు ఇబ్బంది కలిగింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు, ఎన్టీఆర్ అభిమానులను అక్కడినుంచి పంపించేందుకు ప్రయత్నించారు. అయినా అభిమానులు వెళ్లకుండా, పోలీసుల మాటలను వినకపోవడంతో తప్పనిసరిగా అభిమానులపై లాఠీచార్జ్ చేశారు. అంతేకాకుండా కొంతమందిని అదుపులోకి కూడా తీసుకున్నారు. చివరకు పోలీసులు తమ లాఠీలకు పని చెప్పడం వలన అభిమానులు ఎన్టీఆర్ ఇంటి వద్ద నుంచి వెళ్లిపోయారు.
































