Flash Back : మెగాస్టార్ చిరంజీవి అప్పటివరకు జగదేకవీరుడు అతిలోకసుందరి, గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు వంటి ఇండస్ట్రీ హిట్స్ తో ఉన్నారు. అలా స్వింగ్ లో ఉన్న చిరంజీవి ఆ సంవత్సరం కళాతపస్వి కే. విశ్వనాథ్ దర్శకత్వంలో నటించారు.

ఆపద్బాంధవుడు, కె. విశ్వనాథ్ దర్శకత్వంలో 1992లో విడుదలైన ఒక తెలుగు సినిమా. ఇందులో చిరంజీవి, మీనాక్షి శేషాద్రి, జంధ్యాల ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ పతాకంపై ఏడిద నాగేశ్వరరావు నిర్మించాడు. ఎం.ఎం. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించాడు.
మాధవుడు (చిరంజీవి) ఒక పల్లెలో పశువుల కాపరి.ఒక ఉపాధ్యాయుడి (జంధ్యాల) ఇంటికి నమ్మకమైన తోడు.ఉపాధ్యాయుని కూతురు హేమ (మీనాక్షి శేషాద్రి)కి మాధవుడు మంచి దోస్తు. మాధవుడు పశువులను కాస్తుంటాడు.నాటకాలలో వేషాలు కూడా వేస్తుంటాడు.హేమ తండ్రి మంచి కవి, కానీ కవిత్వానికి ఆదరణ లేనందున ఆతని కవిత్వాన్ని ప్రచురించలేకపోతాడు. ఆ తర్వాత అనేక మలుపులు తిరిగి సినిమా ముగుస్తుంది.

అప్పటికి లారీడ్రైవర్, తల్లిదండ్రులు, రౌడీ ఇన్స్పెక్టర్ వంటి చిత్ర విజయాలతో మంచి దూకుడుగా ఉన్న బాలకృష్ణ. ఈ సినిమాలో నటించారు. అశ్వమేధం కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో 1992 లో విడుదలైన చిత్రం. ఇందులో శోభన్ బాబు, బాలకృష్ణ, మీనా, నగ్మా, అమ్రిష్ పురి ప్రధాన పాత్రధారులు. ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ పతాకంపై సి. అశ్వనీదత్ నిర్మించాడు. ఇళయరాజా సంగీతం అందించాడు. ఈ చిత్రానికి సత్యానంద్ కథ, మాటలు అదించగా, యండమూరి వీరేంద్రనాథ్ చిత్రానువాదం రాశాడు.

అశ్వమేధం సినిమా కథలోకి వెళితే.. అభిమన్యు ఒక నిజాయితీగల ఐ.పి.ఎస్ అధికారి. ఒక అంతర్జాతీయ నేరగాడైన వ్యాఘ్రను పట్టుకుంటాడు. కానీ అతను జైలునుంచి తప్పించుకుని పారిపోతాడు. అభిమన్యు తమ్ముడు కిరీటి ఒక పైలట్. అతని సహాయంతో వ్యాఘ్రను మట్టుపెడతాడు అభిమన్యు. కానీ అక్కడ చనిపోయింది కవలల్లో ఒకడైన అనిల్ వ్యాఘ్ర అనీ, అతని సోదరుడు సునీల్ వ్యాఘ్ర అనిల్ మరణానికి కారకులైన అభిమన్యు, కిరీటిల మీద ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు.
ఆ తర్వాత ఏం జరిగిందనేది మిగతా కథ అంశం… చిరంజీవి నటించిన “ఆపద్బాంధవుడు” పరాజయం పొందినప్పటికీ చిరంజీవికి నటునిగా మంచి గుర్తింపు వచ్చింది. అలాగే కే.రాఘవేందర్ రావు దర్శకత్వంలో వచ్చిన “అశ్వమేధం” మరోసారి రాఘవేంద్రరావు-బాలయ్య ఖాతాలో పరాజయాన్ని మూట కట్టుకున్నారు.





























