ఉద్యోగం చేసే ప్రతీ ఒక్కరికీ పీఎఫ్ అవకాశం ఉంటుంది. వారి జీతం నుంచి 12 శాతం వరకు కట్ అవుతుంది. కొన్ని కంపెనీలు ఇలాంటి ఫెసిలిటీని కల్పించాయి. మరికొన్ని కంపెనీలు పీఎఫ్ అవకాశం కల్పించలేదు. అయితే పీఎఫ్ ఉన్న ఉద్యోగులకు ఇక్కడ ఇదొక శుభవార్త అనే చెప్పాలి.
మీరు పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా చేసుకోవాలని భావించేవాళ్లకు .. ఇక మీదట గంటలోనే పీఎఫ్ డబ్బులు పొందే వెసులుబాటు కల్పించింది పీఎఫ్. మెడికల్ ఎమర్జెన్సీ కింద వెంటనే పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చని తెలిపారు. ఇలా మెడికల్ ఎమర్జెన్సీ కింద రూ.లక్ష వరకు డ్రా చేసుకోవచ్చని తెలిపారు. అంతక ముందు 3 నుంచి 7 రోజుల సమయం పట్టేది. ఇప్పుడు దీనిని ఒక గంటకు కుదించారు. ఇంకా దీనికి ఎలాంటి మెడికల్ బిల్లులను సమర్పించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
ఈ డబ్బులను విత్ డ్రా చేసుకోవాలంటే.. ముందుగా అధికారిక వెబ్ సైట్ https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ కి వెళ్లి యూఏఎన్ నంబర్ , పాస్ వర్ట్ ను మరియు క్యాప్చాను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత పీఎఫ్ విత్ డ్రా అనే ఆప్షన్ ను క్లిక్ ఇచ్చిన తర్వాత మరో పేజి ఓపెన్ అవుతుంది.
ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ అంకెలను ఎంటర్ చేయాలి. వెరిఫై చేసుకోవాలి. తర్వాత పీఎఫ్ అడ్వాన్స్ సెలెక్ట్ చేయాలి. కారణం తెలియజేయాలి. స్కాన్ చేసిన చెక్ అప్‌లోడ్ చేయాలి. ఆధార్ ఓటీపీపై క్లిక్ చేసి ఓకే చేయాలి. దీంతో మీ క్లెయిమ్ పూర్తయినట్లే. తర్వాత గంటలోనే మీ అకౌంట్లో డబ్బులు క్రెడిట్ అయిపోతాయి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…