మెగా కుటుంబానికి చెందిన నిహారిక కొణిదెల మరోసారి వార్తల్లో నిలిచారు. హీరోయిన్‌గా పరిచయమై, తరువాత నిర్మాతగా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించిన ఆమె, ఇప్పుడు కొత్త ఉత్సాహంతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

తన నిర్మాణ సంస్థ ‘పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్’ బ్యానర్‌పై రూపొందుతున్న తాజా చిత్రం రాకాస విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాను ఏప్రిల్ 3న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు వెల్లడించారు. హర్రర్, కామెడీ, ఫాంటసీ మిశ్రమంగా తెరకెక్కిన ఈ చిత్రం కుటుంబం మొత్తం కలిసి చూడగలిగే ఎంటర్‌టైనర్‌గా ఉండబోతుందని చిత్రబృందం చెబుతోంది.
ఈ సినిమాలో హీరోగా సంగీత్ శోభన్ నటించడం విశేషం. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన వెబ్ కంటెంట్‌కు మంచి స్పందన రావడంతో, ఇప్పుడు అదే కాంబోలో సినిమా రావడం ఆసక్తిని పెంచుతోంది. సినిమా కథ, ట్రీట్‌మెంట్ కొత్తగా ఉంటుందని, ప్రేక్షకులను అలరిస్తుందని నిహారిక నమ్మకం వ్యక్తం చేశారు.
ఇదిలా ఉంటే, కొంతకాలంగా నటనకు దూరంగా ఉన్న నిహారిక తన సెకండ్ ఇన్నింగ్స్‌పై కూడా క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం అనేక కథలు వింటున్నానని, అందులో కొన్ని కథలు తనకు బాగా నచ్చాయని తెలిపారు. సరైన ప్రాజెక్ట్ కుదిరితే మళ్లీ హీరోయిన్‌గా తెరపై కనిపించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు.
ప్రస్తుతం నిర్మాతగా విజయవంతంగా కొనసాగుతున్న నిహారిక, తిరిగి నటిగా ఎంట్రీ ఇస్తే ఎలా ఉంటుందన్న ఆసక్తి అభిమానుల్లో పెరిగింది. ఆమె మళ్లీ మేకప్ వేసుకుని కెమెరా ముందుకు వస్తారా లేదా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.



























