Gaana : డిజిటల్ రివల్యూషన్ వళ్ళ ఏ విషయమైనా సామాజిక మధ్యమాల్లో ఇట్టే వైరల్ అవుతుంది. అలాగే ఒక ఫేక్ న్యూస్ అయినా సరే అందరికీ వ్యాపింపచేస్తుంది అలాగే చాలా మంది దానిని నమ్మేస్తారు, అలా వదంతులు వ్యాపించకుండా ఎన్ని చర్యలు ప్రభుత్వాలు తీసుకుంటున్న ఫలితం లేదు. భారతదేశం లాంటి దేశంలో మతం ఒక సున్నిత అంశం, అలాంటి మతం మీద ఒక చిన్న మాట తేడాగా మాట్లాడినా అది ఒక ఆందోళనకు దారీ తీయవచ్చు, ఇలాంటి సంఘటనలు చాలానే చూసాము. అయితే సామాజిక మాధ్యమాల కారణంగా ఇలాంటి ఘటనలు ఎక్కువయ్యాయి.

గానా యాప్ లో సర్ తాన్ సే జుదా నినాదాలు…
మత ఛాందసవాదులను కీర్తిస్తూ వచ్చే పాటలు గానా యాప్ లో ఉన్నాయంటూ కొంతమంది గానా యూజర్లు ఫిర్యాదు చేస్తున్నారు. ట్విట్టర్ లో #Boycott_GaanaApp ను విపరీతంగా ట్రెండ్ చేస్తున్నారు. అసలు ఏమైంది అనే విషయానికి వస్తే ఉదయపూర్ లో టైలర్ కన్హయ్య లాల్‌ను హత్య చేసిన గౌస్ మహ్మద్, రియాజ్ అక్తరీ హత్య తర్వాత వారు సర్ తాన్ సే జుదా నినాదాలు చేశారు. ఇక గానా యాప్ లో ఈ నినాదాలతో పాటు గుస్తాఖ్-ఎ-నబీ కి ఏక్ సాజా, సార్ తాన్ సే జుదా అనే నినాదాలు ఉన్నాయి. అందుకనే, చాలా మంది వినియోగదారులు ఈ పాటను గానా యాప్ నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి గానా యాప్ నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు.
The disturbing slogans of Sar Tan Se juda which caused a series of killings are no longer restricted to the streets.
— ॥Radhe Radhe॥ ???????? (@RadheRa13719273) July 11, 2022
They have now penetrated major music platforms and being downloaded to short videos to issue veiled threats to Hindus #Boycott_GaanaApp@HMOIndia pic.twitter.com/qofh5yFPab
????Strict action against these social platforms should be taken for instigating violence against Hindus.
— Lakshmi kumar (@Lakshmi50426035) July 11, 2022
???? This shows these music platforms are anti Hindu & anti India & they are posing serious threat to the integrity of the nation.#Boycott_GaanaApp pic.twitter.com/UAsgAoTwu9
దీంతో ఆగ్రహించిన వినియోగదారులు ట్విట్టర్లో బాయ్ కాట్ గానా అంటూ ట్రెండ్ చేస్తున్నారు. అనేక హత్యలకు దారితీసిన ‘సర్ తాన్ సే జుదా’ ఆందోళనకరమైన నినాదాలు ఇకపై వీధులకే పరిమితం కాలేదు. అవి ఇప్పుడు మెయిన్ సాంగ్స్ స్ట్రీమింగ్ యాప్స్‌లోకి కూడా ప్రవేశించారు అంటూ చాలా మంది నెటిజన్స్ పోస్ట్లు పెడుతున్నారు. హిందువులను పరోక్షంగా బెదిరించడానికి చిన్న వీడియోస్ రూపంలో డౌన్‌లోడ్ చేస్తున్నారు అంటూ ఆరోపణలు చేస్తున్నారు. హిందువులపై హింసను ప్రేరేపించే ఈ సోషల్ మీడియా లేదా సాంగ్స్ యాప్ పై కఠిన చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. అయితే మరికొంతమంది ఈ పాట కేవలం గానా యాప్ లోనే కాదు ఇతర సంగీతం మధ్యమాలలో కూడా ఉందని ఫిర్యాదు చేస్తున్నారు.






























