Gaddar daughter Vennela : తెలంగాణ ఉద్యమగళం మూగబోయింది. ఆశుగా పాటలను పాడి ప్రజలలో చైతన్యం నింపిన గద్దర్ ఇక లేరు. ఎంతో మందిని తన గళంతో ఉత్తేజపరిచి గ్రామాలలో గిరిజనుల మీద జరుగుతున్న అకృత్యాలను చెబుతూ గిరిజన, స్త్రీ లకోసం పోరాడిన ఉద్యమకారుడు తెలంగాణ తొలి మరియు మలి ఉద్యమాలలో తన గళంతో చైతన్యం నింపిన గద్దర్ జులై 20వ తేదీన గుండెపోటుతో అపోలో హాస్పిటల్ లో చేరగా బైపాస్ సర్జరీ జరిగింది. అయితే ఆపరేషన్ తరువాత ఊపిరి తిత్తులు, యూరినరీ సమస్యలతో ఆగష్టు 6న మరణించారు. ఇక ఆయన గురించి ఆయన కూతురు వెన్నెల వివరించారు.

ఎపుడూ మా గురించి పట్టించుకోలేదు…
గద్దర్ గారు ఉద్యోగం కూడా మానేసి ప్రజా జీవితంలో గడిపారు. ప్రజా సమస్యల కోసం అన్నల బాట నడిచారు. ఆయన తన బాల్యంలో అడవిలోనే ఉండేవారు, నాకు మూడో ఏట వరకు ఆయన జ్ఞాపకాలు పెద్దగా లేవు అంటూ వెన్నెల తెలిపారు. ఆయన ఇంటికి వచ్చినపుడు మాత్రం ఆయన గుండెల మీద పడుకునేదాన్ని అంటూ వెన్నెల తెలిపారు. ఆయనకు నేను గారాల పట్టి అంటూ వెన్నెల తెలిపారు. అయితే తన తండ్రి ఏనాడూ పిల్లలు ఏమి చదువుతున్నారు ఎక్కడ చదువుతున్నారు వంటి విషయాలను పట్టించుకోలేదు అంటూ వెన్నెల తెలిపారు. ఇన్నేళ్లు మేము మీడియా ముందుకు రాకపోవడం వల్లే ఎవరికి వారు మేము విదేశాల్లో చదివాము, అక్కడే స్థిరపడ్డాం అనుకుంటున్నారు వాటిని మీద క్లారిటీ ఇవ్వాలనే ఈరోజు మాట్లాతున్నట్లు వెన్నెల తెలిపారు.

తన అన్న ఎమ్బిఏ చేసి ఉద్యోగం చేస్తున్నారని, తాను ఎమ్బిఏ చేసి పిహెచ్డి చేసినట్లు తెలిపారు. తమ్ముడు ఎమ్బిబిఎస్ రెండో సంవత్సరంలో ఉన్నపుడు అనారోగ్యంతో మరణించారు. నేను పిహెచ్డి చేసినట్లు కూడా గద్దర్ గారికి తెలియదు. నేను మల్లారెడ్డి కాలేజీ లో పనిచేస్తున్నట్లు కూడా తెలియదు. ఒకసారి తెలిసాక మా వెన్నెల ఇక్కడ పనిచేస్తుందా అని ఆశ్చర్యపోయారు. ఇక ఇంట్లో మా చదువులు ఇంటి బాధ్యత అమ్మ విమల గారిదే అంటూ తెలిపారు. నాన్న ఇంటికి వస్తే ఉదయమే ఎక్కడికైనా వెళ్లాలంటే మాత్రం అమ్మను లేపకుండా కిచెన్ లోకి వెళ్లి టీ పెట్టుకుని తాగి వెళ్ళిపోతారు. అమ్మ కిచెన్ లోకి వెళ్ళగానే అక్కడ శుభ్రం చేసుకోవడం అలవాటు. ఆయన అది పాటిస్తారు అమ్మ కోసం, వంట చేయడం రాదు. చివరగా హాస్పిటల్ లో జాయిన్ అయ్యేటపుడు కూడా నేను మళ్ళీ వస్తా అంటూ చెప్పి వెళ్లారు అంటూ వెన్నెల ఎమోషనల్ అయ్యారు.