General News

IND vs ENG 1st Test: నాలుగు క్యాచ్‌లు వదిలిన జైస్వాల్‌పై గంభీర్ స్పందన.. అభిమానులకు షాక్‌ ఇచ్చిన గంభీర్ !

Gambhir's response to Jaiswal dropping four catches..

ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో భారత్ ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఐదుగురు బ్యాట్స్ మెన్ సెంచరీలు చేసినా, మ్యాచ్‌ను గెలవలేకపోవడానికి ప్రధాన కారణం ఫీల్డింగ్ వైఫల్యమే. రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి భారత ఆటగాళ్లు ఏడు కీలకమైన క్యాచ్‌లను వదిలివేయడంతో మ్యాచ్ టీమిండియా చేతులు దులుపుకుంది.

Gambhir’s response to Jaiswal dropping four catches..

ఈ క్రమంలో యశస్వీ జైస్వాల్ ఫీల్డింగ్‌లో ఘోరంగా విఫలమవడం పెద్ద దుమారానికే దారి తీసింది. అతను ఒక్కడే రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి నాలుగు క్యాచ్‌లు వదిలేసాడు. ముఖ్యంగా రెండవ ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ ఓపెనర్ డకెట్ 97 పరుగుల వ్యక్తిగత స్కోరుతో ఉన్న సమయంలో క్యాచ్ వదిలేయడం మ్యాచ్‌పై ప్రభావం చూపింది. ఆ తర్వాత డకెట్ 149 పరుగులు చేసి ఇంగ్లాండ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.

సామాజిక మాధ్యమాల్లో జైస్వాల్‌పై తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తుతుండగా, టీమిండియా కొత్త హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మాత్రం అతని పక్షంగా నిలిచారు. విలేకరుల సమావేశంలో మాట్లాడిన గంభీర్, “క్యాచ్‌లు మిస్ అవుతాయి. ప్రపంచంలో అత్యుత్తమ ఫీల్డర్లు కూడా ఒకోసారి తప్పులు చేస్తారు. ఎవ్వరూ ఉద్దేశపూర్వకంగా క్యాచ్ వదిలేరు. ఒక్క జైస్వాల్‌ను బాధ్యుడిగా చేయడం సరైంది కాదు,” అంటూ జైస్వాల్‌ను రక్షించే ప్రయత్నం చేశారు.

“ఈ ఓటమికి ఎవ్వరినీ భాద్యులుగా భావించడం లేదు. క్రికెట్‌లో ఇలాంటివి సహజం. కానీ లోయర్ ఆర్డర్ బ్యాటింగ్ మేము ఆశించినట్టుగా లేదు. మొదటి ఇన్నింగ్స్‌లో మేము 600 పరుగులు చేయాల్సిన అవకాశం ఉంది. కానీ 40 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయాం. అదే రెండవ ఇన్నింగ్స్‌లోనూ 30 పరుగులకే 6 వికెట్లు పోయాయి. ఇది మా ఓటమికి ప్రధాన కారణం.”

ఇలా గంభీర్ తన వ్యాఖ్యలతో జైస్వాల్‌పై పెరుగుతున్న ఒత్తిడిని తక్కువ చేయాలని ప్రయత్నించారు. ఇక రెండవ టెస్టులో భారత జట్టు ఫీల్డింగ్‌లో మెరుగుపడుతుందేమో వేచి చూడాలి.

telugudesk

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago