Geetha Krishna : ప్రతిసారి ఏడో ఒక వైరల్ న్యూస్ ను అనాలసిస్ చేస్తూ వైరల్ అవుతున్న డైరెక్టర్ గీతా కృష్ణ మరోసారి సినిమా ఇండస్ట్రీ లో నిర్మాతల ఖర్చులు, హీరోలు హీరోయిన్లు చేస్తున్న దుబారా ఖర్చుల గురించి మాట్లాడారు. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో నిర్మాతల సమస్యలను గురించి చర్చ జరుగుతోంది. ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించాలని అందరూ భావిస్తుంటే హీరోల రెమ్యూనరేషన్లు తగ్గించాలని కొంత మంది భావిస్తున్నారు. ఇదిలా ఉంటే గీతా కృష్ణ హీరోల ఖర్చులు హీరోయిన్ల ఖర్చుల గురించి మాట్లాడారు.

బాలకృష్ణ ఫుడ్డు ఖర్చు.. చిరు కొత్త కారు…
బాలకృష్ణ సినిమా షూటింగులప్పుడు భోజనం ఖరీదైన హోటల్ నుండే కావాలని డిమాండ్ చేస్తాడట. ఇక అదే హోటల్ నుండి తన కుటుంబ సభ్యులకు కూడా భోజనం పంపించాలని చెప్తారట. ఈ మొత్తం ఖర్చు నిర్మాతదే. ఇది ఎంతవరకు నిజమో తెలియదు, నాకు తెలిసిన వ్యక్తి చెప్పడం వలన తెలిసింది, ఇంతకుముందు బాలకృష్ణ అలా ఉండేవాడు కాదు అంటూ చెప్పారు. ఇక అప్పట్లో చిరంజీవి కి మంచి డిమాండ్ ఉండేది ఆ సమయంలో ప్రతి సినిమాకు కొత్త మారుతీ 800 సీసీ కారు నిర్మాత ఇవ్వాల్సిందే. అలా ఇచ్చేవారు కూడా.

నిర్మాత హీరోకి డిమాండ్ ఉంటే అతనివల్ల బిజినెస్ జరుగుతుంది అనుకుంటే హీరో అడిగినవి ఖచ్చితంగా ఇస్తాడు. సినిమా ఇండస్ట్రీ లో మొత్తం డిమాండ్ మరియు సప్లై అన్నట్లుగా ఉంటుంది. హీరోయిన్లకు కూడా డిమాండ్ ఉంటే జయసుధ చెప్పినట్లు వాల్ల కుక్కకి కూడా రూమ్ ఇస్తారు. అదే హీరోయిన్ కి అవకాశాలు పోయి డిమాండ్ తగ్గినపుడు పట్టించుకోరు అసలు. ఒక హీరో వల్ల పది కోట్లు లాభం వస్తుందనుకుంటే అతనికోసం ఒక కోటి రూపాయలు పెట్టడానికి వెనుకాడరు అంటూ చెప్పారు.


































