Geetha Krishna : ప్రభాస్ ఈశ్వర్ సినిమా చేసి 20 ఏళ్ల సందర్బంగా చాలా మంది ఆయన సినిమా ప్రయాణాన్ని గుర్తుచేసుకున్నారు. ఈశ్వర్ నుండి బాహుబలి వంటి పాన్ ఇండియా సినిమా ద్వారా ఇండియా మొత్తం క్రేజ్ తెచ్చుకున్నాడు. చిన్నగా మొదలైన తన కెరీర్ ఇపుడు హాలీవుడ్ రేంజ్ కి వెళ్ళింది. ఇండియాలోనే కాకుండా విదేశాల్లో కూడా అభిమానులను సొంతం చేసుకున్నాడు ప్రభాస్. ఇక ప్రభాస్ ఇరవై ఏళ్ల కెరీర్ గురించి గీత కృష్ణ కామెంట్స్ చేసారు.

మాట్లాడటమే రాదు, స్టోరీ సెలక్షన్ తెలియదు…
ప్రభాస్ ఈశ్వర్ సినిమా కంటే ముందే తనకు తెలుసని, కాకినాడలో ఉన్నప్పుడు తెలుసనీ చాలా అందంగా ఉంటాడని చెప్పారు. ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజు గారు, ఆయన మొదటి భార్య, వీళ్లందరు బాగా తెలుసనీ ప్రభాస్ కు సినిమాల్లోకి రావాలని ప్లాన్ ఏం లేదని, కాకపోతే తన పెదనాన్న తరువాత సినిమాల్లో ఉండాలన్న కుటుంబం ఆశతో వచ్చాడని, చదువులో కూడా పెద్దగా చదివేవాడు కాదంటూ చెప్పారు. ఇక రాజమౌళి చేతిలో పడ్డాక స్టార్ హీరో అయ్యాడని చెప్పాడు. ఒక్క బాహుబలి సినిమాతో చిరంజీవి కి ఉన్న స్టార్ డమ్, చిరంజీవికి మించిన స్టార్ డమ్ వచ్చిందని చెప్పారు.

అయితే ప్రభాస్ కు అంత బుర్ర లేదని అందుకే బాహుబలి తరువాత సినిమాలు ప్లాప్ అయ్యాయని చెప్పాడు. సాహో ఒక డిజాస్టర్ అయితే రాధే శ్యామ్ అంతకన్నా పెద్ద డిజాస్టర్ అని వర్ణించాడు. స్క్రిప్ట్ ఎంపిక ప్రభాస్ కి రాదని అందుకే అలాంటి చెత్త సినిమాలు చేశాడంటూ చెప్పాడు. మరి వీటిపై ప్రభాస్ ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.






























