Geetha Krishna : ప్రతిసారి ఏదో ఒక విషయం మీద యూట్యూబ్ లో ఇంటర్వ్యూ ఇస్తూ వైరల్ అయ్యే డైరెక్టర్ గీతా కృష్ణ మళ్ళీ ఒకసారి తెలుగు హీరోల గురించి మాట్లాడాడు. ఒక సినిమా ప్రేక్షకుడికి ఏ హీరో నంబర్ వన్ అని తెలుసుకోవాలనే ఆతృత ఉంటుంది. మరీ ముఖ్యంగా అభిమానులకు తమ హీరోనే నెంబర్ వన్ అంటూ మురిసిపోతుంటారు. ఇక ఇప్పుడు సినిమాలు ఖండంతరాలు దాటి ప్రేక్షకులను అలరిస్తున్నాయి. భాషతో సంబంధం లేకుండా సినిమా కంటెంట్ ఉంటే ఆదరిస్తున్నారు. ఇలా ఇపుడు తెలుగు సినిమాలు పాన్ ఇండియా సినిమాలుగా ఇండియాలోనే కాదు ఇతర దేశాల్లోనూ హిట్ అవుతున్నాయి.

బన్నీ నిజమైన పాన్ ఇండియా స్టార్…
ప్రభాస్ బాహుబలి సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ సంపాదించుకున్నాడు. అయితే ఏ మాత్రం ప్రొమోషన్స్ లేకుండా ఇండియా మొత్తం హిట్ అవ్వడమే కాకుండా, జనాల్లో క్రేజ్ సంపాదించుకున్న సినిమా పుష్ప. అల్లు అర్జున్ పుష్ప సినిమాలో ‘తగ్గేదేలే’ డైలాగు తో బాగా ఫేమస్ అయ్యాడు. ముఖ్యంగా నార్త్ ప్రేక్షకులకు బన్నీ స్టైల్ సినిమాలో నటన విపరీతంగా నచ్చాయి. ఇక నిజమైన పాన్ ఇండియా స్టార్ బన్నీనే అంటూ గీతా కృష్ణ అభిప్రాయపడ్డాడు.

బన్నీ తరువాత ప్రభాస్ పర్సనాలిటీ ఫేమ్, అందంతో హాలీవుడ్ రేంజ్ హీరోలా ఉంటాడు అతను మంచి కథలను ఎంచుకుంటే పాన్ ఇండియా స్టార్ గా మరింత క్రేజ్ సంపాదిస్తాడు. ఇక రామ్ చరణ్ ఎన్టీఆర్ లు కూడా ఆర్ఆర్ఆర్ సినిమా వల్ల ఇండియా మొత్తం గుర్తింపు తెచ్చుకున్నారు. ఎన్టీఆర్ నటన చాలా బాగుంటుంది, వీళ్ళు కూడా మంచి కథలను ఎంచుకుంటే పాన్ ఇండియా స్టార్స్ గా ఎదుగుతారు అంటూ కామెంట్స్ చేసారు.































