Geetha Krishna : వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ ఇప్పటి సినిమాలు హీరోల గురించి కామెంట్స్ చేస్తూ వైరల్ అవుతున్న ఓల్డ్ డైరెక్టర్ గీత కృష్ణ. తమిళ హీరోలు, తెలుగు హీరోల గురించి వారి అందాన్ని కాపాడుకోవడం కోసం ఎలాంటి పాట్లు పడుతున్నారో కామెంట్స్ చేసారు. చిరంజీవి లాంటి పెద్ద హీరోలు ఎలాంటి కథలను ఎంచుకుంటే బాగుంటుందో చెప్పారు.

చిరు, నాగార్జున అందం ఎలా కాపాడుకుంటున్నారో తెలుసా…
సీనియర్ హీరోలు వారి ఏజ్ కి తగ్గట్టు సినిమాలు తీస్తే బాగుంటుందని గీతాకృష్ణ అభిప్రాయపడ్డారు. చిరంజీవి లాంటి పెద్ద హీరోలు యంగ్ హీరోయిన్స్ పెట్టుకుని, యంగ్ డైరెక్టర్ తో సినిమా తీసినంత మాత్రాన యంగ్ అని అభిమానులు అనుకోరాని, వాళ్ళ కొడుకు కూడా హీరోగా సక్సెస్ అయ్యాడు కాబట్టి అదే దృష్టితో చూస్తారని చెప్పారు. ఇక చిరంజీవి, నాగార్జున వంటి వారు ముడతలను దాచుకోడానికి బోటాక్స్ ఇంజక్షన్ చేయించుకుంటారని ఇక మెడ దగ్గర వేలాడుతున్న చర్మాన్ని గ్రాఫిక్స్ లో కవర్ చేస్తారని అప్పట్లో నాగేశ్వరావు గారు మెడ దగ్గర చర్మానికి సర్జరీ చేయించుకున్నారని చెప్పారు.

ఫిట్ నెస్ కోసం వ్యాయమం చేస్తే వారి ఏజ్ తగ్గరని, ఇక పునీత్ రాజ్ కుమార్ ఉదంతం తరువాత వ్యాయామం చేయాలంటే భయపడుతున్నారని చెప్పారు. ఇక ప్రభాస్ కు బ్రెయిన్ లేదంటూ వాఖ్యణించిన గీతాకృష్ణ ఇపుడు మాత్రం ఆలోచించుకోవాలనే అలా చెప్పానని చెప్పారు. స్లిమ్ లుక్ లో చాలా బాగున్నాడని చిన్న ఏజ్ కాబట్టి త్వరగా తగ్గుతారని 50 దాటాక శరీరంలో మార్పు కష్టమని చెప్పారు. తమిళ్ హీరో విక్రమ్ ‘ఐ’ సినిమా కోసం సన్నబడడంతో లుక్ బాగోలేదని ఆ సినిమా హిట్ అవ్వకపోవడం పక్కన పెడితే ఇపుడు ఆ లుక్ బాగోలేక అది మార్చుకోవడం కూడా ఈ ఏజ్ లో కష్టమైందని అన్నారు.

ఇక కమల్ హాసన్ విక్రమ్ సినిమా కేవలం కమల్ హాసన్ మాత్రమే పెట్టి తెస్తే ప్లాప్ అయ్యేదని సపోర్ట్ కోసం సూర్య, విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ వంటి వారిని డైరెక్టర్ తెలివిగా పెట్టాడని చెప్పారు. ఇక చిరంజీవి కూడా కొంచెం ఈ విషయంలో తెలుసుకుంటే బాగుంటుందని, పెద్ద తరహా పాత్రలు చేస్తూ కుర్ర హీరోలను యంగ్ పాత్రలకు పెట్టుకుంటే బాగుంటుందని అభిప్రాయ పడ్డారు. మరి ఎలాంటి కథలను చిరు ఎంచుకుంటే బాగుంటుంది అనే ప్రశ్నకు అది వ్యక్తిగతంగా ఆయనకే చెబుతానని ఇలా చెప్పానంటూ దాటవేశారు.



























