Geetha Krishna : ఇటీవల అన్నమయ్య కీర్తనను పాడి, శ్రావణ భార్గవి వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఆ కీర్తనను అశ్లిలంగా కాళ్ళు ఊపుతూ పాడిందని అన్నమయ్య వంశస్థులు అభ్యంతరం వ్యక్తం చేయడం, అవసరం అయితే కోర్టును ఆశ్రయిస్తామని చెప్పడం తెలిసిందే. అయితే తాజాగా ఈ వివాదంపై దర్శకుడు గీతా కృష్ణా ఒక ఇంటర్వ్యూలో స్పందించాడు. శ్రావణ భార్గవి ఎందుకు అలా చేసి ఉంటుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ఆఫర్ల కోసం ఒక పబ్లిసిటీ స్టంట్…
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న గీతా కృష్ణ.. శ్రావణ భార్గవి వివాదం గురించి ప్రస్తావించగా, చాలా మంది అలా చేసి ఉండకూడదు తప్పు అని అంటున్నారు కానీ నాకు అలా అనిపించట్లేదు అని చెప్పారు. సంకీర్తనలు అంటే దేవుడి ముందు కూర్చొని మాత్రమే పాడాలని ఎక్కడ వుంది, చాలా మంది చాలా రకాలుగా పాడుతుంటారు, ఈ అమ్మాయి తనకు నచ్చినట్టుగా ఊల్లాసంగా పాడింది. అది తన ఇష్టం అని చెప్పారు.

నాకు తెలిసి ఆ అమ్మాయి పబ్లిసిటీ క్రియేట చేయాలనీ అలా చేసివుండొచ్చు, ఈ మధ్య ఇలా పబ్లిసిటీ తెచ్చుకోవడం ఎక్కువగా వుంది, పైగా మంచి పబ్లిసిటీ కూడా వస్తుంది, ఇటీవల విశ్వక్ సేన్ వివాదం చూసాము కదా. శ్రావణ భార్గవికి ఇటీవల సినిమా అవకాశాలు ఎక్కువగా లేక ఇలా చచేసిండొచ్చు. అలా కాదు నిజంగానే అలా పాడినా అందులో తప్పు నాకు కనిపించట్లేదు అని చెప్పుకొచ్చారు.



























