Geethakrishna : మోహన్ బాబు బీజేపీలోకి వెళ్లినంత మాత్రాన జగన్ కి వచ్చే నష్టం లేదు: గీతాకృష్ణ

0
337

Geethakrishna : తాజా విషయాల గురించి, సెలబ్రిటీల గురించి స్పందిస్తూ ఈ మధ్య వరుస ఇంటర్వ్యూలతో వైరల్ అవుతున్నారు గీతాకృష్ణ. తాజాగా వైసీపీ నుండి మోహన్ బాబు బీజేపీ పార్టీలోకి జంప్ అవుతున్న నేపథ్యంలో గీతాకృష్ణ కామెంట్స్ చేసారు. తాజాగా రాజకీయాల గురించి స్టడీ చేస్తున్నాను అంటూ చెప్పుకున్నారు. ఇక నేను ఏ పార్టీకి చెందిన వాడిని కాదు, అభిమానిని కాదు అంటూనే జగన్ భజన చేసారు.

వైసీపీ కి వచ్చిన నష్టం లేదు…

మోహన్ బాబు కుటుంబం వైసీపీ పార్టీతో సన్నిహితంగా ఉండటమే కాకుండా బంధుత్వం కూడా ఉంది, విష్ణు భార్య వెరోనికా వల్ల జగన్ కు బంధువులు. ఇక ఫిలిం ఇండస్ట్రీ లో టికెట్ రేట్ల సమస్య వచ్చినపుడు పర్సనల్ గా బావని అడిగితే పరిష్కరిస్తాడంటూ మీడియా ముందు మాట్లాడిన విష్ణు ఆ తరువాత టాలీవుడ్ పెద్దలు జగన్ తో చర్చించినపుడు ఆ దరిదాపుల్లో కనిపించలేదు. ఇక ఇపుడు బీజేపీ తీర్థం పుచ్చుకుంటున్న మోహన్ బాబు గురించి డైరెక్టర్ గీతాకృష్ణ మాట్లాడారు. మోహన్ బాబు ముందు టీడీపీ లో ఉండి మళ్ళీ వైసీపీ లోకి వచ్చాడు, ఇపుడు బీజేపీ లోకి వెళ్తున్నారు. ఆయన బీజేపీ కి వెళ్లడం వల్ల వైసీపీ కి వచ్చిన నష్టం ఏం లేదు. జగన్ మంచి వ్యూహకర్త, ఆయన ఎవరినీ అందలం ఎక్కించి తిప్పరు.

మోహన్ బాబు పార్టీ లో చేరి జగన్ తనను స్పెషల్ గా చూడాలని కోరుకున్నాడు కానీ ఆది జరగలేదు కాబట్టి ఇలా పార్టీ నుండి వెళ్ళిపోయి బీజేపీలోకి చేరుంటాడు అంటూ మాట్లాడారు. ఎవరు ఉన్నా లేకున్నా నెక్స్ట్ ఎలక్షన్లో మళ్ళీ వైసీపీ నే వస్తుంది. భజన చేసే వాళ్ళు పార్టీ లో ఉండక పోవచ్చు కానీ లబ్ది పొందిన బలహీన వర్గాల వాళ్ళు ఓట్లు వేసేటపుడు వైసీపీ కి వేసి మళ్ళీ జగన్ ను గెలిపిస్తారు. దాదాపు 60% మంది దాకా జగన్ అంటే అభిమానంతో ఉన్నారని గీతా కృష్ణ తెలిపారు.