Geethakrishna : ప్రతిసారి ఏదో ఒక వైరల్ టాపిక్ గురించి తనదైన శైలిలో మాట్లాడుతూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న డైరెక్టర్ గీత కృష్ణ ఇపుడు క్యాస్టింగ్ కౌచ్ గురించి కామెంట్స్ చేసారు. ఏ ఇండస్ట్రీలో అయినా క్యాస్టింగ్ కౌచ్ పెద్ద సమస్య. ఇది అన్ని రంగాల్లో ఉన్నా సినిమా ఇండస్ట్రీలో మాత్రం ఎక్కువగా బయటికి వస్తూ ఉంటుంది. చాలా మంది హీరోయిన్లు అవకాశాల కోసం సినిమా రంగంలో ఎదుర్కునే కష్టాలను చెబుతూ ఉంటారు. డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, హీరోలు కమిట్‌మెంట్ అడగడం వంటివి కొంతమంది బయటికి చెప్పినపుడు మాత్రం కొన్నిరోజులు చర్చించుకుని ఆ తరువాత మళ్ళీ మర్చిపోవడం కామన్ అయిపోయింది.

హీరోయిన్లు కూడా దీన్ని మార్కెటింగ్ చేసుకుంటున్నారు…
ఇక సీనియర్ దర్శకుడు గీత కృష్ణ దీని గురించి స్పందిస్తూ వివాదాస్పద వాఖ్యలు చేసారు. ఇటీవల నీతూ చంద్ర అనే హీరోయిన్ ఒక వ్యాపార వేత్త తనకు భార్యగా ఉంటే 25 లక్షలు ఇస్తానని చెప్పాడంటూ ఒక ఇంటర్వ్యూ లో చెప్పడం, అలాగే సాక్షి చౌదరి అనే మరో హీరోయిన్ కూడా కోటి రూపాయలు ఇస్తానని ఒక బిజినెస్ మాన్ అడిగాడని చెప్పడం గురించి మాట్లాడాడు. వాళ్లకు నిజంగా అలా జరిగిందో లేదో కానీ వాళ్ళు మాత్రం ఆ విషయం పబ్లిక్ లో చెప్పి వాళ్ళ మార్కెట్ పెంచుకుంటున్నారు. నిజంగా అలా జరుగుంటే వాళ్లకు తిరస్కరించి సైలెంట్ గా ఉండొచ్చు కానీ ఇలా బయటికి చెప్పాల్సిన అవసరం లేదు. ఇలాంటివి ఇండస్ట్రీ లో కామన్. చాలా మంది హీరోయిన్లు డబ్బుల కోసం దుబాయ్ ట్రిప్ లు వెళ్తుంటారు. అక్కడ ధనవంతున్ని పెళ్లి చేసుకుని ఆ తరువాత పిల్లలను తీసుకుని ఇండియా కి వచ్చిన వాళ్ళు ఉన్నారు.

ఒక ఫేమస్ హీరోయిన్ కి 100 కోట్లు ఆఫర్ చేసారు. ప్రస్తుతం ఆ హీరోయిన్ పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ లో సెటిల్ అయింది అందుకే పేరు చెప్పడం లేదు అంటూ అన్నారు. సెలబ్రిటీ అవ్వడం వల్ల ఆ క్రేజ్ ఉంటుందని ఆయన అభిప్రాయ పడ్డారు. ఇలాంటివి ఇండస్ట్రీ లో కామన్, ఇలాంటి విషయాలకు మళ్ళీ బ్రోకరేజ్ చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళను ట్రిమ్మర్స్ అంటారు. వాళ్లకు యాభై లక్షల నుండి కోట్లు అందుతాయి. ఇలాంటివి అన్నీ సినిమా ఇండస్ట్రీల్లోను ఉంటాయి.



























