Geneliya: జెనీలియా పరిచయం అవసరం లేని పేరు.జెనీలియా తెలుగులో ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు పొందారు. అయితే ఈమె నటుడు రిషితేశ్ దేశ్ ముఖ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే. ఇక పెళ్లి తర్వాత జెనీలియా పూర్తిగా నటినకు దూరమై ఇంటికి పరిమితమయ్యారు.
ఇకపోతే జెనీలియా ఇద్దరు పిల్లలకు తల్లిగా మారిన అనంతరం ఈమె పూర్తిగా తన పిల్లల సంరక్షణ చేపడుతూ ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. ఇక జెనీలియా మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విలాస్ రావ్ దేశ్‌ముఖ్ ఇంటికి కోడలుగా వెళ్లిన విషయం మనకు తెలిసిందే. ఇక జెనీలియా తన మామయ్యను కూడా పప్పా అంటూ ఎంతో ప్రేమగా పిలుచుకుంటారు. ఇక ఈయన ఆగస్టు 14 2012 లో మరణించిన విషయం మనకు తెలిసిందే.
ఈ క్రమంలోనే తాజాగా తన పిల్లలు తనని ఓ ప్రశ్న అడిగారంటూ ఈమె తన మామయ్య గురించి ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పప్పా ఈరోజు రియాన్, రహైల్ నన్ను ఓ ప్రశ్న అడిగారు. అమ్మ మేము తాతను ఓ ప్రశ్న అడిగితే సమాధానం చెబుతారా? అంటూ చెప్పుకొచ్చారు.ఈ ప్రశ్నకు తాను సమాధానం చెబుతూ మీరు వినగలిగితే సమాధానం చెబుతారు అని చెప్పానని ఈమె వెల్లడించారు.
ఇన్ని సంవత్సరాల నుంచి నేను అడిగే ప్రశ్నకు మీరు సమాధానం చెబుతూనే ఉన్నారు. మీ సమాధానం నేను వింటూనే ఉన్నాను. మాకు ఏదైనా క్లిష్ట పరిస్థితులు ఎదురైతే ఆ సమయంలో మీరు మాకు అండగా ఉన్నారు. మా కోసం మీరు అండగా ఉంటానని మీరు నాకు మాట ఇచ్చారు. మేము కళ్ళు చేవులు తెరిచి, మీ మాటలు ఎప్పుడూ వింటూనే ఉంటాము. వీ మిస్ యు పప్పా అంటూ తన మామయ్య గురించి ఎమోషనల్ పోస్ట్ చేశారు ప్రస్తుతం ఈమె చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…