Getup Seenu : జబర్దస్త్ వల్ల మంచి గుర్తింపు తెచ్చుకుని ప్రస్తుతం కమెడియన్స్ గా మంచి పేరు తెచ్చికుంటున్నవారిలో గెటప్ శీను ఒకడు. తాను ఏ పాత్రలో అయినా పరకాయ ప్రవేశం చేసేస్తాడు. అందుకే అందరూ అతనికి బుల్లితెర కమలహాసన్ అంటూ బిరుదు కూడా ఇచ్చేసారు. ఇక శీను కి సినిమా అవకాశాలు బాగా వచ్చాయి. ఈ మధ్య చాలా సినిమాల్లో మంచి పాత్రలలో శీను కనిపిస్తున్నాడు. దీంతో జబర్దస్త్ లో కనిపించలేదు. ఇక సుధీర్, ఆది, అభి వంటి వారు వెళ్లిపోయారు కాబట్టి శీను కూడా వారి లాగే వెళ్లిపోయాడేమో అని అందరూ భావించినా శీను మళ్ళీ జబర్దస్త్ కి రీ ఎంట్రీ ఇచ్చి అందరినీ సర్ ప్రైజ్ చేసాడు. మంచి గుర్తింపు తో అటు సినిమాల్లోనూ ఇటు టీవీ షోలోనూ రానిస్తున్న గెటప్ శీను ఫ్యామిలీ గురించి చాలా తక్కువ తెలుసు అందరికీ అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన ఫ్యామిలీ గురించి పంచుకున్నారు శీను.

నా భార్య వల్లే ఈ లక్ అంత…
బోడుపల్లి శీను ది ఆచంట మండలం కళింగపాలెం వెస్ట్ గోదావరి జిల్లా. ఇక వ్యవసాయ కుటుంబం నుండి వచ్చిన శీను నటన మీద ఆసక్తితో హైదరాబాద్ వచ్చి అవకాశాల కోసం ఆఫీస్ ల చుట్టూ తిరుగుతూ ఉండేవారు. ఇక తల్లిదండ్రులకు పెద్దగా సినిమాలు ఇలాంటి వాటి గురించి తెలియదని కేవలం టీవీ లో కనిపిస్తాడు అంత వరకే తెలుసు అదే నాకు ఆనందం అంటూ శీను చెప్పారు. ప్రస్తుతం ఇక్కడికి వచ్చినా ఈ వాతావరణం సెట్ అవ్వక హైదరాబాద్ వస్తే అనారోగ్యానికి గురవ్వుతారు అందుకే ఊరులో ఉండటానికి ఇష్టపడుతారు అంటూ చెప్పారు శీను.

ఇక భార్య సుజాత గురించి చెబుతూ తనని పెళ్లి చేసుకున్నాక అదృష్టం బాగా కలిసిచ్చిందంటూ చెప్పారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న శీను ఆయన భార్య కెరీర్ పరంగా తనకు బాగా సపోర్ట్ చేసిందని చెప్పారు. సాఫ్ట్వేర్ ఉద్యోగిగా ఉండేది ఇప్పుడు అది మానేసి సొంతంగా ఆన్లైన్ లో బోటిక్ నడుపుతోంది తనకు నచ్చిన పని చేస్తూ ఇంటిని చూసుకుంటోంది అంటూ ఆయన వ్యక్తిగత జీవితం గురించి చెప్పారు శీను.

































