Getup Seenu : జబర్దస్త్, ఎక్సట్రా జబర్దస్త్ ఈ రెండూ తెలుగు ప్రేక్షకులకు దాదాపు పదేళ్లుగా వినోదాన్ని అందిస్తున్నాయి. ఎన్నో కామెంట్స్, ట్రోల్స్ ఫ్యామిలీ ఆడియన్స్ చూసేలా లేవు అంటూ ఏవేవో నెగెటివ్ కామెంట్స్ వస్తున్నా జబర్దస్త్ మాత్రం జబర్దస్తీగా సాగుతోంది. అయితే ఇటీవల ఈ షో నుండి స్టార్ కమెడియన్స్ ఒక్కొక్కరిగా బయటకి వెళ్లిపోవడం జబర్దస్త్ అభిమానులను బాధపెట్టింది. ఇతర ఛానెల్స్ లో అవకాశాల కోసం జబర్దస్త్ ను వీడి వెళ్ళిపోతున్నారు చాలా మంది కమెడియన్స్. ఇక జబర్దస్త్ లో స్టార్ కమెడియన్స్ అయిన హైపర్ ఆది, సుధీర్, గెటప్ శీను కూడా వెళ్లిపోయారు. ఇక అదిరే అభి లాంటి వారు కూడా షో నుండి వెళ్లిపోయారు. దీంతో ఒక్కసారిగా జబర్దస్త్ లో ఏం జరుగుతోంది అనే ప్రశ్న మొదలయింది.

రీ ఎంట్రీ ఇచ్చిన గెటప్ శీను…
ఇక లేటెస్ట్ గా ఎక్సట్రా జబర్దస్త్ ప్రోమోలో శీను జబర్దస్త్ కి వచ్చి అందరికి షాక్ ఇచ్చాడు. రామ్ ప్రసాద్ స్కిట్స్ చేస్తుండగా మధ్యలో శీను వచ్చి ఎంట్రీ ఇచ్చాడు దీంతో ఒక్కసారిగా జడ్జెస్ తో సహా అందరూ షాక్ అయ్యారు. ఇక రామ్ ప్రసాద్ వేస్తున్న స్కిట్స్ ఆపేసి శీను ని కలిపి మళ్ళీ కొత్త స్కిట్స్ వేసాడు. ఇక జడ్జెస్, మిగిలిన కంటెస్టెంట్స్ అందరూ ఎమోషనల్ అయ్యారు. ఇక ప్రోమో చూసిన ప్రతి ఒక్కరూ శీను వచ్చేసాడు అలాగే ఇక మళ్ళీ సుధీర్, హైపర్ ఆది కూడా వచ్చేస్తారంటూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

జబర్దస్త్ కి ఎంతో మంది వస్తుంటారు పోతుంటారు కానీ జబర్దస్త్ మాత్రం అలాగే ఉంటుంది కొత్త వారికి అవకాశం ఇస్తూ ఉంటుంది అంటూ జబర్దస్త్ టీం చెప్పడం ఆకట్టుకుంది. ఇక జబర్దస్త్ నుండి అనసూయ వెళ్లిపోవడం జబర్దస్త్ ప్రోమోలో చూపించారు. ఈ వారం ప్రసారమయ్యేది అనసూయ లాస్ట్ ఎపిసోడ్ ఆ తరువాత అనసూయ జబర్దస్త్ లో కనిపించదు. ఇక అందరూ ఎమోషనల్ అయి అనసూయ కు వీడ్కోలు పలకడం ప్రోమోలో ఆకట్టుకుంది.



























