Getup Srinu: ఇటీవల మొదలైన జబర్దస్త్ షో వివాదం గురించి అందరికి తెలిసిందే. కిరాక్ ఆర్పీ మొదలు పెట్టిన ఈ వివాదం రోజుకు ఒకరి కౌంటర్లతో రసవత్తరంగా సాగుతోంది. మొదట జబర్దస్త్ షో వాళ్లు ఆర్టిస్ట్‌లను బానిసలుగా చూస్తారు, తిండి కూడా సరిగా పెట్టరు అంటూ ఆరోపణలు చేసి వివాదాన్ని మొదలుపెట్టాడు ఆర్పీ. ఆతరువాత ఆర్పీ చేసిన ఆరోపణలు అన్ని అబద్దాలే అని కౌంటర్ ఇచ్చారు హైపర్ ఆది, ఆటో రామ్ ప్రసాద్. ఇక ఇపుడు తాజాగా ఇంతకు ముందు జబర్దస్త్ ప్రోగ్రాంకి ప్రొడక్షన్ మేనేజర్ గా పని చేసిన ఏడుకొండలు స్పందించారు.

కిరాక్ ఆర్పీకి కౌంటర్ ఇచ్చిన ఏడుకొండలు ఒక రేంజ్‌లో కడిగి పారేశాడు. అంతేకాకుండా ఆర్పీతో పాటు జబర్దస్త్ కాదని వేరే ఛానల్స్ కు వెళ్లిన సుడిగాలి సుధీర్, గెటప్ శీనులపై కూడా ఆరోపణలు చేశాడు. వెళ్లిపోయిన వారందరు తిరిగి మర్యాదగా జబర్దస్త్‌కి రావాలని లేకపోతే అందరి గురించి బయటపెడతానంటూ హెచ్చరించాడు కూడా. ఇక ఏడుకొండలు, తాను అప్పట్లో సుధీర్, గెటప్ శీను, ఆటో రాంప్రసాద్‌తో పాటు ఇంకా మిగిలిన కమెడియన్లకు కూడా ఒక్కొక్కరికి పది లక్షలు చొప్పున ఇప్పించానని చెప్పాడు. గెటప్ శీను కార్ కొనుక్కోవాలి రెమ్యూనరేషన్ పెంచమని అడిగితే నా కారు ఇచ్చేసానని కూడా చెప్పాడు. ఇపుడు ఈ వ్యాఖ్యలపై గెటప్ శీను స్పందించారు.
బిల్డప్ బాబాయ్ అంటూ…
ఇపుడు గెటప్ శీను ఇన్‌డైరెక్ట్‌గా ఏడుకొండలపై స్పందిస్తూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. ‘నేను అమ్మాను అని చెప్పడానికి.. ఇచ్చాను అని చెప్పడానికి చాలా వ్యత్యాసం ఉందయ్యా.. కెమెరా ఉంటే సాలు సృహ లేకపోతే ఎలాయ్యా’ అన్న వ్యాఖ్యలతో పాటు కొండలు ఉన్నట్టుగా ఉన్న ఒక ఎమోజీని కూడా షేర్ చేశాడు. దీంతో ఇది ఏడుకొండలకి కౌంటర్ అని అందరికి అర్థమైపోయింది. కారు అమ్మితే తాను కొనుక్కున్నానని, కారు ఇచ్చేశాను అనడానికి, అమ్మాను అని చెప్పడానికి చాలా తేడా ఉందని గెటప్ శీను చెప్పకనే చెప్పాడు.

అంతేకాకుండా సోషల్ మీడియా వేదికగా డైరెక్టుగా కూడా ఏడికొండలకు కౌంటర్ ఇచ్చాడు. ఏకంగా ఏడుకొండలు ఫొటోని ఒక్కటి పెట్టి.. ‘నేను స్కిట్లో చేసిన బిల్డప్ బాబాయ్ క్యారెక్టర్‌కి ఇతనే స్పూర్తి’ అంటూ గట్టి కౌంటర్ ఇచ్చాడు. కొంతమందికి డబ్బులు ఇచ్చాను, శీనుకి కారు ఇచ్చాను అని చెప్పడంతో ఏడుకొండలను బిల్డప్ బాబాయ్ తో పోల్చి కౌంటర్ ఇచ్చాడు గెటప్ శీను.

































