God father & Ghost : కుర్ర హీరోలకు పోటీగా ఆరుపదుల వయసులోనూ ఏమాత్రం తగ్గకుండా సినిమాలను చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్. నలుగురు హీరోలు చాలా సార్లు పోటీ పడిన సందర్భాలు ఉన్నా ఇందులో నాగార్జున, చిరంజీవి పోటీ పడిన దాఖలాలు లేవు. అయితే వీళ్ళిద్దరూ మొదటి నుండి మంచి స్నేహితులు. ఒకరి సినిమాలకు ఒకరు ప్రమోట్ చేసుకోవడం వంటి మంచి స్నేహపూర్వక వాతవరణం ఇద్దరి మధ్య ఉంది. అయితే ఇపుడు ఇద్దరి మధ్య ఏమి జరిగిందో తెలియదు కానీ ఇద్దరూ ఒకేర్పజు సినిమా విడుదల చేయడానికి సై అంటున్నారు.

ఇద్దరిలో ఎవరిది పై చేయి అవుతుందో…
దసరా పండుగకు సెలవులు రావడం, పండుగ కావడంతో సినిమాలకు మంచి సీజన్ అనే చెప్పాలి. పెద్ద సినిమాలు విడుదలకు మంచి సెంటిమెంట్ దసరా పండుగ. అయితే ఈ సారి దసరా పండుగకు రెండు పెద్దసినిమాలు సందడి చేయనున్నాయి. అవే చిరు గాడ్ ఫాదర్, నాగ్ ఘోస్ట్. ఇందులో చిరు గాడ్ ఫాదర్ మలయాళం సినిమా లూసిఫర్ కి రీమేక్ కాగా, విడుదలయిన ట్రైలర్ వల్ల మంచి స్పందన, సినిమా మీద అంచనాలు ఉన్నాయి. ఇక నాగార్జున ఘోస్ట్ యాక్షన్ థ్రిల్లర్ గా గరుడవేగ ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో రాబోతుండడంతో సినిమా మీద అంచనాలు ఉన్నాయి. అయితే రెండు పెద్ద హీరోల సినిమాలు ఒకే రోజు రావడం అంత మంచి విషయం కాదు. దీనివల్ల థియేటర్స్ వారికి డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలే. ఒక వారం గ్యాప్ తో సినిమాలు వచ్చినా సరిపోతుంది కానీ ఇలా ఒకే రోజు క్లాష్ అయితే బైయర్స్ కి ఇబ్బందే.

ఇక దీని మీద ప్రముఖ జర్నలిస్ట్ ఇమంది రామారావు మాట్లాడుతూ ఇది అంత మంచి పరిణామం కాదు ఇద్దరూ మంచి స్నేహితులు ఇటీవల ‘లాల్ సింగ్ చద్ధ’ సమయంలోనూ నాగచైతన్య నటించాడని చిరు ఆ సినిమాను ప్రమోట్ చేసాడు. ఇక అంత చక్కని అనుబంధం ఇద్దరికి ఉన్నపుడు ఇద్దరూ మాట్లాడుకుని సినిమా రిలీజ్ డేట్ సర్దుబాటు చేసుకుంటే మంచిది ఎందుకంటే రెండు సినిమాల మీద అంచనాలు ఉన్నాయి. ఇటీవలే చిన్న సినిమలుగా వచ్చిన సీతా రామం, బింబిసార, కార్తికేయ 2 విజయాలతో సినీ ఇండస్ట్రీ గాడిన పడుతోందని అనుకుంటే అంతలోనే లైగర్ వచ్చి మళ్ళీ పరిస్థితిని మార్చింది. అలాంటపుడు ఈ రెండు పెద్ద హీరోల సినిమాలు గ్యాప్ తో వస్తే రెండు మంచి వసూళ్లను రాబడితే ఇండస్ట్రీ కి మంచిది అంటూ చెప్పారు.































