Gopichand: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా పలు సినిమాలలో నటించి మంచి సక్సెస్ అందుకున్నటువంటి గోపీచంద్ ఈ మధ్యకాలంలో వరుస ఫెయిల్యూర్ సినిమాలను చవిచూస్తున్నారు అయితే తాజాగా ఈయన లక్ష్యం లౌక్యం వంటి సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన డైరెక్టర్ శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కిన రామబాణం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.
ఈ సినిమా మే 5వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా తాజాగా డైరెక్టర్ తేజ గారితో కలిసి గోపీచంద్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా తేజ గారు ఎన్నో రకాల ప్రశ్నలు వేస్తూ గోపీచంద్ నుంచి సమాధానం రాబట్టారు.
ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన ప్రోమో వైరల్ అవుతుంది. ఇందులో భాగంగా తేజ ప్రశ్నిస్తూ రామబాణం సినిమా టైటిల్ బాలయ్యతో అనౌన్స్ చేయించారు. ఎందుకు అంటూ ప్రశ్నలతో మొదలుపెట్టారు.నాతో సినిమా చేస్తానని హీరోయిన్ సెట్ కాకపోతే వేరే సినిమాకు వెళ్ళవు తర్వాత నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు ఎందుకు అని ప్రశ్నించగా అందుకు గోపీచంద్ వివరణ ఇచ్చుకున్నారు.
ఇక రామబాణం డైరెక్టర్ తో గొడవలు గురించి కూడా ఈ సందర్భంగా తేజ ప్రశ్నించినట్లు తెలుస్తోంది.ఇక గోపీచంద్ తండ్రి ఇండస్ట్రీలో ఓ గొప్ప డైరెక్టర్ అనే విషయం మనకు తెలిసిందే. ఆయన దర్శకత్వంలో వచ్చిన ఎన్నో సినిమాలు మంచి హిట్ అయ్యాయి. ఇక తన తండ్రి గురించి ప్రశ్నిస్తూ…మీ నాన్న ఇండస్ట్రీలో ఎంతో గొప్పగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. మరి నువ్వు ఇండస్ట్రీకి వచ్చి ఏం పీకావ్ అంటూ సూటిగా గోపీచంద్ ను ప్రశ్నించారు.మరి ఈ ప్రశ్నలన్నింటికీ ఈయన ఎలాంటి సమాధానాలు చెప్పారు అనే విషయం తెలియాలి అంటే ఈ ఇంటర్వ్యూ కి సంబంధించిన ఫుల్ ఎపిసోడ్ వచ్చేవరకు వేచి చూడాలి.
హైదరాబాద్ ఫిబ్రవరి 19: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ,…
2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…
“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…
తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…
నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…