Gopichandh : తొలివలపు సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టిన గోపీచంద్ ఆ తరువాత హీరోగానూ హిట్లు కొడుతూ, అలాగే విలన్ గానూ నటించి ప్రేక్షకులను మెప్పించాడు. లక్ష్యం, రణం, శంఖం లౌక్యం, సౌఖ్యం, సాహసం, గోలిమార్ లాంటి సినిమాలతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక వర్షం, జయం, నిజం సినిమాలలో విలన్ గానూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం మంచి కమర్షియల్ విజయాలను అందుకోలేక సతమతమవుతున్న గోపీచంద్ ఇప్పుడు పక్కా కమర్షియల్ సినిమాతో వస్తున్నాడు.

నా ముక్కు మా అన్నయ్యే కోశాడు…
ఈ సినిమా ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటున్న గోపీచంద్ ఈటీవీలో ప్రసారమయ్యే ఆలీతో సరదాగా ప్రోగ్రాంలో పక్కా కమర్షియల్ సినిమా దర్శకుడు మారుతితో కలిసి పాల్గొన్నారు. ఇక గోపీచంద్ తన తండ్రి గురించి, తన సినిమాల విశేషాలను పంచుకున్నారు. షో మొదలు పెట్టడమే గోపీచంద్ ను ఆలీ రష్యన్ లో పలకరించారు. ఇక తన తండ్రి కృష్ణ బ్రతుకున్నప్పుడు జీవితం ఎలా ఉండేది ఆ తరువాత ఎలా ఉందనే తేడా చిన్న వయసులోనే బాగా తెలిసిందని ఇక తన చిన్నతనంలో జరిగిన విషయాలను పంచుకున్నారు.

చిన్నతనంలో తన అన్న ప్రేమ్ చంద్ ముక్కు కోసి పప్పులో పెడతా అంటే అలా ఎలా పెడతావు ముక్కు పోతుంది కదా అన్నాను. చేతిలో బ్లేడ్ వెనుక పెట్టుకుని, తల పైకి ఎత్తు అని ముక్కుని బ్లేడ్ తో కోశాడు వెంటనే బాగా రక్తం కారింది. ఆ సమయంలో పెరుగన్నం తింటున్నా, మొత్తం ప్లేట్ లో రక్తం కారింది అంటూ అప్పటి విషయాలను పంచుకున్నారు. ఇక దర్శకుడు మారుతి ఎలా దర్శకుడిగా మారాడో చెప్పారు. కొంతమంది దర్శకులు చిన్న సలహాలు ఇస్తే నువ్వేమన్నా డైరెక్టర్ వా, పని చూసుకో అన్నారట. అందుకనే డైరెక్టర్ అయ్యానని చెప్పారు. ఇక ఈ ప్రోమో ఇపుడు నెట్టింట్లో సందడి చేస్తోంది.

































