Governer Tamilisai : తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర్ రాజన్ గవర్నర్ గా తన బాధ్యతలనే కాదు ఒక వ్యక్తి ప్రమాదం సమయంలో సహాయం చేసి ధాత్రుత్వాన్ని చాటుకుంది. తనతో ప్రయాణిస్తున్న పాసింజర్ ను ప్రాణాపాయం నుండి కాపాడింది. గవర్నర్ తమిళసై వారణాసి వెళ్లి ఢిల్లీ మీదుగా హైదరాబాద్ రావడానికి ఇండిగో ఫ్లైట్ లో ప్రయాణించే సమయంలో ఘటన చోటు చేసుకుంది.

ఛాతీ నొప్పితో బాధపడుతున్న ప్రయాణికుడికి ఫస్ట్ ఎయిడ్…
ఇండిగో ఎయిర్ విమానంలో ఛాతీ నొప్పితో బాధపడుతున్నాడని ఎయిర్ హాస్టస్ నుండి ప్రకటన రావడంతో తమిళసై గారు అత్యవసర చికిత్స ను అందించడానికి ముందుకు వచ్చారు. అతనికి అజీర్ణానికి సంబంధిచిన సమస్యతో బాధపడుతున్నాడని అర్థం చేసుకున్న గవర్నర్ వెంటనే అందుకు తగ్గట్టుగా ప్రథమ చికిత్స అందించారు. ఇక తమిళసై విమాన సిబ్బందికి సూచనలు ఇచ్చారు. ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లో అన్ని సరైన మందులను అందుబాటులో ఉంచడం, ఎప్పటికప్పుడు చెక్ చేస్తుండడం చేయాలని, ఇక సీపీఆర్ చేయడం సాధారణ ప్రజలు నేర్చుకోవడం వల్ల అత్యవసర పరిస్థితుల్లో ఒకరి ప్రాణాలు కాపాడిన వారు అవుతారని చెప్పారు.

Mr Mudavath, it was our absolute pleasure to have @DrTamilisaiGuv onboard with us. We salute our superheroes and can’t thank them enough for their selfless contribution always.💙 https://t.co/CEAN6jpwHI
— IndiGo (@IndiGo6E) July 23, 2022
విమానం సిబ్బంది ఇలా అనౌన్స్మెంట్ ఇచ్చినప్పుడు ఇంకా అలర్ట్ గా ఉండాలని ఉదయం నాలుగు సమయంలో అలర్ట్ ఇచ్చారు ఆ సమయంలో నేను నిద్రపోయి ఉంటే కష్టమయ్యేది కదా అందుకే డీటెయిల్స్ తీసుకున్నపుడు ఎవరైనా డాక్టర్స్ ఉన్నారా అని రిపోర్ట్ చేయడం మంచిదని సూచించారు. ఇక తమిళసై స్వతహాగా డాక్టర్, పుదుచెర్రీ లెఫ్టినెంట్ గవర్నర్ గా పనిచేయకముందు గైనకాలజిస్ట్ గా సేవలందించారు.