Gowtham Krishna : సూపర్ స్టార్ కృష్ణ గారి సతీమణి ఇందిరా దేవి గారు నిన్న ఉదయం కన్నుమూశారు. ఇప్పటికే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె పలు మార్లు ఆసుపత్రికి వెళ్తూ వచ్చేవారు. అయితే మాములుగా వెళ్లి వచ్చేస్తారు అని అందరూ అనుకున్న ఈ సారి మాత్రం తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఆవిడ మరణం కృష్ణ గారిని ఆయన కుటుంబాన్ని తీవ్ర విషాదం లోకి నెట్టేసింది.ఇక మహేష్ బాబు కూతురు సితార వెక్కి వెక్కి ఏడ్చిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. అయితే మహేష్ బాబు కూతురు సీతార కనిపించింది కానీ తనయుడు గౌతమ్ నాన్నమ్మ మృత దేహం వద్ద కనిపించలేదు.

విదేశాల్లో ఉండడం వల్ల రాలేకపోయిన గౌతమ్…
నాన్నమ్మ ను ఆఖరిసారిగా చూసేందుకు మనవడు గౌతమ్ రాలేకపోయాడు. దీనికి కారణం గౌతమ్ ప్రస్తుతం విదేశాల్లో చదువుకుంటున్నాడు. గతంలోనే గౌతమ్ చదువుకోవడం కోసం ఒంటరిగా విదేశాలకు వెళ్తున్నట్లు మహేష్ తన సోషల్ మీడియాలో మొదటి సారి తనని వదిలి ఉండబోతున్నాం అంటూ ఎమోషనల్ పోస్ట్ కూడా పెట్టారు. ఇక నమ్రత కూడా కొడుకును మిస్ అవుతున్నట్లు పోస్ట్ చేసారు. అందువల్లే నాన్నమ్మ ను కడసారి చూసేందుకు కూడా రాలేకపోయాడని అర్థమవుతోంది.

సితార, గౌతమ్ లకు నాన్నమ్మ ఇందిర దేవి అంటే చాలా ఇష్టం. కానీ విదేశాల్లో ఉండటం వల్ల సమయానికి రాలేకపోయాడు. అధికాక ఇందిర దేవి గారు అనారోగ్య కారణాలతో మరణించడం వల్ల ఆమె మృత దేహాన్ని ఎక్కువ సేపు ఉంచడానికి కుటుంబ సభ్యులు సిద్ధపడలేదు. ఇక గట్టమనేని కుటుంబం చాలామంది విదేశాల్లో సెటిల్ అయ్యారు వారిలో రాగలిగిన వారు వచ్చారు చాలా మంది రాలేకపోయారు. అలా నానమ్మ ను చివరిసారిగా గౌతమ్ చూడలేక పోయాడు.































