Gummadi Sharada : అప్పటి సినిమా హీరోలకు తండ్రి పాత్రలో ఎక్కువగా కనిపించి ఆయన కన్నా వయసులో పెద్ద హీరోలకు తండ్రిగా నటించి పేరు తెచ్చికున్న నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు గారు. గుంటూరు జిల్లాకు చెందిన ఆయన చదువుకునే సమయంలోనే నాటకాల మీద మక్కువతో నాటకాలు వేసేవారు. ఆ తరువాత సినిమాల్లో నటించడానికి మద్రాస్ వెళ్లి అవకాశాల కోసం ప్రయత్నంచారు. ఇక మొదట్లో అంతగా అవకాశాలు రాకపోయిన ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎక్కువ సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. సుమారు 500 లకు పైగా సినిమాల్లో నటించిన ఆయన గురించిన వివరాలను ఆయన కూతురు గుమ్మడి శారద గారు వివరించారు.

ఆ పాత్రలు చేసేటపుడు నరకం అనుభవించారు…
విశ్వామిత్ర, భీష్మ వంటి పాత్రల సమయంలో గుమ్మడి గారు పడిన ఇబ్బందులను ఆయన కూతురు శారద గారు వివరించారు. గడ్డం విగ్గు పెట్టుకుని చెయ్యాలిసిన పాత్రలు కావడంతో వాటిని గమ్ తో అంటించేవారు, ఆ సమయలో తినాలన్నా కష్టమే అందుకోసం కేవలం లిక్విడ్ ఫుడ్ తీసుకునేవాళ్ళు. ఆ గమ్ వేసి గడ్డం, విగ్గు అంటించడం వల్ల తీసేటపుడు బాగా నొప్పి వచ్చేది. అలాంటి పౌరానిక పాత్రలు వేసినపుడు నరకం చూసేవారు నాన్నగారు అంటూ శారద తెలిపారు.

ఆ పాత్రలు ఆయన ఊరికే ఏమి చేయలేదు కదా అని అనేవారు ఉంటారు కానీ డబ్బు తీసుకునే చేసినా కూడా ఇబ్బంది ఉంటుంది కదా అంటూ తెలిపారు. ఇక గుమ్మడి గారికి పక్షవాతం రావడం వల్ల గొంతు పడిపోయి కొన్ని నెలలు మాట్లాడటానికి ఇబ్బంది పడ్డారట. ఇక ఆయన చివరి రోజుల్లో చాలా ప్రశాంతంగా జీవించారంటూ ఆయన కూతురు తెలిపారు. గుండె బలహీన పడటం వల్ల బైపాస్ చేయించాల్సి వచ్చిందని తెలిపారు. అయితే చివరి రోజుల్లో పాత మిత్రులు రోజూ వచ్చి ఆయనతో కాసేపు కబుర్లు చెప్పడం, పద్యాలను పాడటం వంటివి చేసేవారని తెలిపారు.
































