Gummadi Sharada : అప్పటి సినిమా హీరోలకు తండ్రి పాత్రలో ఎక్కువగా కనిపించి ఆయన కన్నా వయసులో పెద్ద హీరోలకు తండ్రిగా నటించిన పేరు తెచ్చికున్న నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు గారు. గుంటూరు జిల్లాకు చెందిన ఆయన చదువుకునే సమయంలోనే నాటకాల మీద మక్కువతో నాటకాలు వేసేవారు. ఆ తరువాత సినిమాల్లో నటించడానికి మద్రాస్ వెళ్లి అవకాశాల కోసం ప్రయత్నంచారు. ఇక మొదట్లో అంతగా అవకాశాలు రాకపోయినా ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎక్కువ సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. సుమారు 500 లకు పైగా సినిమాల్లో నటించిన ఆయన గురించిన వివరాలను ఆయన కూతురు గుమ్మడి శారద గారు వివరించారు.

మోహన్ బాబూ మా బంధువు…
గుమ్మడి శారద గారు తన తండ్రి గురించి ఆయన సినిమా విశేషాలను మాట్లాడుతూ ఇండస్ట్రీలో కొంతమందిని అయన పరిచయం చేసారని అయితే కొంతమంది అయన పరిచయం చేసారని చెప్పుకుంటారు కొంత మంది చెప్పుకోరని తెలిపారు. ఇక హీరో గా విలన్ గా తనకంటూ మంచి గుర్తింపు అందుకున్న విలక్షణ నటుడు మోహన్ బాబు గారి గురించి శారద మాట్లాడారు.

మోహన్ బాబుగారు మా మూడో అక్క మరిది అంటూ చెప్పారు. మా అక్క పెళ్లి జరిగినప్పటికి ఇంకా మోహన్ బాబు గారు సినిమా ఇండస్ట్రీలోకి రాలేదని, నాన్న గారే చాలా మంది వద్దకు తీసుకెళ్లి పరిచయం చేసారని గుమ్మడి శారద తెలిపారు. ఇక గణేష్ పాత్ర, తదితరులు వారిని తీసుకోచ్చింది నాన్నగారే అని చెప్తారు. కానీ మరికొంతంది నాన్న గారివల్ల ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా ఆయన పేరు చెప్పుకోరని తెలిపారు.






























