GV Narayanarao : నవయుగ డిస్ట్రిబ్యూషన్ ద్వారా సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టిన జీవీ ప్రసాద్ గారి కొడుకు జీవీ నారాయణ రావు గారు, కే. బాలచందర్ గారి ‘అంతులేని కథ’ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. హీరోగా కొన్ని సినిమాల్లో నటించిన నారాయణ గారు, ఆ తరువాత సినిమా ప్రొడక్షన్ లో అడుగుపెట్టి యముడికి మొగుడు, చట్టానికి కళ్ళు లేవు వంటి సినిమాలను నిర్మించారు. ఇక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను చాలా సినిమాల్లో నటించిన ఆయన ఇంట్రస్టింగ్ విషయాలను పలు ఇంటర్వ్యూల్లో పంచుకున్నారు.

ఎన్టీఆర్ తో పోటీ తట్టుకోలేక ఏఎన్ఆర్ హైదరాబాద్ వచ్చేసారు…
ఇక అప్పటి విషయాలను మాట్లాడుతూ సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్ కు తరలివచ్చినప్పటి విషయాలను మాట్లాడారు. అప్పట్లో విజయ సంస్థకు పర్మినెంట్ హీరోగా ఎన్టీఆర్ ఉండేవారు. ఇక ఏఎన్ఆర్ గారు తనకంటూ నిర్మాణ సంస్థలు ఉండాలని భావించి కథల ఎంపికలో జాగ్రత్తగా ఉండే ఏఎన్ఆర్ 1964 సమయంలో ఎన్టీఆర్ తో పోటీ పడలేక హైదరాబాద్ వచ్చేయాలని భావించి వచ్చేసారు.

ఇక సారథి స్టూడియోస్ తో గొడవ కారణంగా అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించారు. అప్పటి సీఎం చెన్నారెడ్డి గారు చొరవ చూపి తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం హైదరాబాద్ వస్తే బాగుంటుందని భావించి రాయితీ ధరలకు స్థలాలు అలాగే సినిమాలు తెలుగు రాష్ట్రములో తీస్తే టాక్స్ బెనిఫిట్స్ ఇచ్చారు. అలా సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్ వచ్చిందని జీవీ నారాయణ తెలిపారు.
































