GVS Murthi : గిడుగు వెంకట సత్యనారాయణ మూర్తి గారు సీనియర్ జర్నలిస్ట్ గా ఈనాడు, ఇండియా టుడే వంటి పత్రికలకు సబ్ ఎడిటర్ గా ఎన్నో ఏళ్ళు పనిచేసి శ్రీ పీఠం అనే సొంత పత్రికను నడిపారు.హోమియో డాక్టర్ గా కెరీర్ మొదలు పెట్టి ఆ పైన ఈనాడు పత్రికకు సబ్ ఎడిటర్ గా పనిచేసి సుమారు 30 ఏళ్ళు ఈనాడు, ఇండియా టుడే, ఆంధ్ర పత్రిక, కృష్ణ పత్రిక లలో పనిచేసారు. అలనాటి కాంగ్రెస్ పాలన అప్పటి రాజకీయాల గురించి ఆయన ఇటీవల యూట్యూబ్ లో ఒక ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో పంచుకున్నారు. విజయవాడ కి చెందిన గిడుగు వెంకట సత్యనారాయణ గారు ఈనాడు పత్రికకు పనిచేసే సమయంలో జరిగిన పలు సంఘటనలను వివరించారు.

రామోజీరావును తట్టుకోలేక ఇందిరా గాంధీ వద్దకు….
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి సీఎం గా పనిచేసిన కాంగ్రెస్ లీడర్ జలగం వెంగళ్రావు గారికి ఈనాడు అధినేత రామోజీరావు గారికి మధ్య జరిగిన సంఘటనలను గిడుగు వెంకట సత్యనారాయణ గారు గుర్తు చేసుకున్నారు. ఒకానొక సమయంలో చిట్ ఫండ్ మీద ప్రభుత్వం చట్టాలను తెచ్చిన సమయంలో రామారావు రాజకీయాల్లోకి వచ్చిన సమయంలో మీ కులస్తుడు రాగానే మమల్ని వదిలేస్తావా అంటూ జలగం వెంగల్రావు గారు రామోజీరావు గారిని అడిగారట.

మేము ఫండ్స్ ఇస్తున్నాం కాదా మర్చిపోయావా మీ కులస్థుడే ఎక్కువయ్యాడా అంటూ జలగం అడిగారట. ఇక రామారావు వెంటే నువ్వు ఉండు మాకవసరం లేదు మేమిచ్చిన డబ్బు వెనక్కిచ్చెయ్ అన్నట్లు జలగం మాట్లాడారాట . అయితే ఆ తరువాత రామోజీరావును ఎదుర్కొనలేక జలగం వెంగల్రావు గారు మళ్ళీ ఇందిరా గాంధీ గారి దగ్గరికి వెళ్లి ఆమెకు తల దించాల్సి వచ్చిందంటూ ఙివిఎస్ మూర్తి తెలిపారు.





























