దేశముదురు సినిమాతో తెలుగునాట అడుగుపెట్టి కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టించిన పాల బుగ్గల సుందరి హన్సిక. “దేశముదురు” సినిమా తరువాత కొన్ని సినిమాలు చేసినా అనుకున్నంత అవకాశాలు తెలుగులో రవకపోవడంతో మెల్లిగా తమిళ తంబిలకు దగ్గరైంది హన్సిక. అక్కడ వరుసపెట్టి అవకాశాలను చేజిక్కించుకుంది. వరుస అవకాశాలతో ఆమె క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అయితే ఎన్నిరోజులు ఒకేలా ఉండవు కదా.. కొద్దిరోజులుగా అక్కడ అమ్మడుకి అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో ఈ అమ్మడు వెబ్ సిరీస్ లపై దృష్టిపెట్టింది. “నషా” పేరుతొ తెలుగులో ఒక వెబ్ సిరీస్ చేస్తోంది ఈ అమ్మడు. పిల్ల జమిందార్ ఫెమ్ జి. అశోక్ ఈ వెబ్ సిరీస్ కు దర్శకుడు.

అసలు విషయానికి వస్తే ప్రేమించుకుని విడిపోయిన హీరో హీరోయిన్లు మళ్ళీ స్నేహితులుగా మారడం అంత ఈజీ ఏమి కాదు. అటువంటి వారు ఎదురుపడినా మాట్లాడుకొని సందర్భాలు కోకొల్లలు. కానీ హన్సిక మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తోంది. అయితే గతంలో తమిళ హీరో శింబుతో ప్రేమాయణం సాగించిన విషయం తెలిసిందే.. ఆ తరువాత కొన్ని మనస్పర్థలు వచ్చి విడిపోవడం జరిగింది. కానీ తాజగా శింబు నటిసున్న ఒక సినిమాలో హన్సిక గెస్ట్ రోల్ చేస్తుండటంతో మళ్లీ వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిదనే టాక్ మొదలైంది. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ సమయంలో షూటింగ్స్ లేకపోవడంతో.. అభిమానులకు దగ్గరగా ఉండేందుకు హన్సిక ఒక యూట్యూబ్ ఛానెల్ క్రేయేట్ చేసింది. అందులో అభిమానులతో ఒక లైవ్ సెషన్ కూడా పెట్టింది. ఈ సందర్భంగా పలు ఇంట్రెస్టింగ్ విషయాలను తన అభిమానులతో పంచుకుంది.

అదే సమయంలో అభిమానులు శింబు గురించి ప్రశ్నిస్తుండటంతో.. శింబు తనకు మంచి స్నేహితుడని.. మాజీ ప్రేమికులు మంచి స్నేహితులుగా ఉండకూడదా? అంటూ తిరిగి ప్రశ్నించింది. ఎదో ఒకరోజు స్నేహితులం మళ్ళీ లవర్స్ అయ్యాం అని హన్సిక అంటుందేమో అంటూ సెటైర్స్ వేస్తున్నారు నెటిజన్లు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here