Prasanth Varma: టాలీవుడ్ లో ఉన్న యంగ్ డైరెక్టర్ లలో ఒకరైన ప్రశాంత్ వర్మ గురించి మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ పేరు తెలుగు సినిమా ఇండస్ట్రీలో అలాగే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. కాగా ప్రశాంత్ వర్మ తాజాగా దర్శకత్వం వహించిన చిత్రం హనుమాన్. తేజ సజ్జా, అమ్రితా అయ్యర్ జంటగా నటించిన ఈ మూవీ జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లలో సక్సెస్ఫుల్ గా రన్ అవుతూ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమా మంచి సక్సెస్ ను సాధించిన సందర్భంగా మూవీ మేకర్స్ ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు.

అలాగే డైరెక్టర్ ప్రశాంత్ వర్మ పాన్ ఇండియా రేంజ్‍లో ఫేమస్ అయ్యారు. దీంతో PVCUలో ప్రశాంత్ వర్మ తర్వాత చేసే సినిమా ఏది అని ఇంటర్నెట్‍లో చాలా మంది వెతికేస్తున్నారు. అయితే హనుమాన్ చిత్రానికి సీక్వెల్‍గా జై హనుమాన్ వస్తుందని సినిమా ఆఖర్లో మూవీ మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. 2025లో జై హనుమాన్ వస్తుందని ఖరారు కూడా చేశారు. అయితే ఈ చిత్రం కంటే ముందు ప్రశాంత్ వర్మ మరో సూపర్ హీరో మూవీ చేయనున్నారటీ. ఆ సినిమా పేరు అధీర. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ స్ట్రైక్ గ్లింప్స్ కూడా గత ఏడాదిలోనే విడుదల చేశారు.
అధీర చిత్రంతో ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య కుమారుడు కల్యాణ్ దాసరి హీరోగా పరిచయం కానున్నారు. ఈ మూవీలో హీరోకు కరెంట్ షాక్ లాంటి అతీత శక్తి ఉంటుందని చూపించారు దర్శకుడు ప్రశాంత్ వర్మ. బ్లాక్ సూపర్ హీరో డ్రెస్‍లో అధీర లుక్ అదిరిపోయింది. చివర్లో చూపించే వజ్రాయుధం లాంటిది కూడా ఇంట్రెస్ట్ పెంచేసింది. అధీర చిత్రాన్ని హనుమాన్ నిర్మాత నిరంజన్ రెడ్డి ప్రైమ్ షో ఎంటర్‌టైన్‍మెంట్ పతాకంపై నిర్మిస్తున్నారు. హనుమాన్‍కు బీజీఎం ఇచ్చిన గౌరహరి మ్యూజిక్ డైరెక్టర్ కాగా శివేంద్ర దాశరథి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించనున్నారు. అధీర చిత్రాన్ని ఈ ఏడాదే రిలీజ్ చేయాలని ప్రశాంత్ వర్మ ప్లాన్ చేస్తున్నారు.
ఆ మూవీ తర్వాతనే జై హనుమాన్..
ఈ మూవీ తర్వాత జై హనుమాన్ మొదలుపెట్టి 2025 లో రిలీజ్ చేసేలా ప్రణాళికలు రచించుకున్నారు ప్రశాంత్ వర్మ. అయితే ప్రశాంత్ వర్మ దశకత్వం వహిస్తున్న తదుపరి సినిమా అధీర గురించి త్వరలోనే అప్‍డేట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాగా, తన సినిమాటిక్ యూనివర్స్ PVCUలో 12 చిత్రాలు వస్తాయని ప్రశాంత్ వర్మ ఇదివరకే వెల్లడించారు. దీంతో ప్రశాంత్ వర్మ తదుపరి సినిమా కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.




























