Categories: FeaturedMovie News

వైవీయస్‌ చౌదరి గారి పుట్టినరోజు సందర్బంగా అయన సినిమా జీవితం..

ఈయన చేసింది తక్కువ సినిమాలే అయినా… తెలుగు చిత్ర పరిశ్రమపై తనదైన ముద్ర వేశారు. దర్శకుడిగానే కాకుండా… రచయితగా, నిర్మాతగా, పంపిణీదారుడిగా, ఆడియో కంపెనీ అధినేతగా, ప్రదర్శనకారుడిగా ఆయన పరిశ్రమతో విడదీయలేని అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు. ఎన్టీఆర్‌కి వీరాభిమాని అయిన చౌదరి, ఆయన స్ఫూర్తితోనే చలన చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. కృష్ణాజిల్లా, గుడివాడలో 23 మే 1965లో ఒక మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన వైవీయస్‌ చౌదరికి చిన్నప్పట్నుంచే సినిమాలపై ఆసక్తి ఏర్పడింది. చదువుకొనే వయసులోనే ఎన్టీఆర్‌ అభిమాన సంఘాన్ని స్థాపించి దానికి అధ్యక్షుడిగా వ్యవహరించారు.

ఆ తర్వాత అందరి సినిమాలు చూస్తూ… వాటిలో లోటుపాట్లు, మంచి చెడులు…. ఏ సినిమా ఎంత వసూళ్లు సాధిస్తుందో స్నేహితుల దగ్గర చెప్పేవాడట. ఇంజినీరింగ్‌ చదువుకోవడం కోసం మద్రాసు వెళ్లిన ఆయన, సినిమాలపై ఇష్టంతో చదువుని పక్కనపెట్టి అక్కడే ఎడిటింగ్‌ విభాగంలో చేరారు. ఆ తర్వాత సహాయ దర్శకుడిగా ప్రయాణం ప్రారంభించారు. ఎన్టీఆర్‌తో పలు చిత్రాలు తీసి విజయాలు అందుకొన్న కె.రాఘవేంద్రరావు అంటే చౌదరికి ఎంతో అభిమానం. దాంతో ఆయన ఎలాగైనా రాఘవేంద్రరావు దగ్గర సహాయ దర్శకుడిగా చేరాలనుకొన్నారు. కానీ అప్పటికే ఆయన దగ్గర చాలామంది ఉండటంతో కుదరదని చెప్పారు. అయినా పట్టు వదలకుండా వారం రోజులపాటు ఆయన ఇంటి దగ్గరే నిలబడి సహాయ దర్శకుడిగా అవకాశం సంపాదించారు.

అలా ‘పట్టాభిషేకం’, ‘కలియుగ పాండవులు’, ‘సాహస సామ్రాట్‌’, ‘అగ్నిపుత్రుడు’, ‘దొంగరాముడు’, ‘జానకిరాముడు’, ‘రుద్రనేత్ర’, ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ చిత్రాలకి పనిచేశారు చౌదరి. ఆ తర్వాత వైజయంతీ మూవీస్‌లో చేరి ‘అశ్వమేథం’, ‘గోవిందా గోవిందా’ చిత్రాలకి కో డైరెక్టరుగా పనిచేశారు. ‘క్రిమినల్‌’, ‘గులాబి’, ‘నిన్నే పెళ్లాడతా’ చిత్రాల తర్వాత నాగార్జున అవకాశం ఇవ్వడంతో ఆయన నిర్మాణంలో ‘శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి’ చిత్రం చేశారు చౌదరి. ఒక ముఖ్యపాత్రలో ఏఎన్నార్‌… ప్రధాన పాత్రధారులుగా కొత్తవాళ్లతో తెరకెక్కిన ఆ చిత్రం ఘన విజయం సాధించింది. ఆ తర్వాత నాగార్జునే ‘సీతారామరాజు’ చేసే అవకాశం ఇచ్చారు. అది కూడా విజయవంతమైంది.

ఆ చిత్రం తర్వాత మహేష్‌బాబుతో ‘యువరాజు’ చేశాడు. కానీ అది పరాజయం పాలైంది. ఆ ఫలితం చూసి, నిర్మాతలెవ్వరూ సినిమాలు చేయడానికి ముందుకు రాకపోవడంతో ‘బొమ్మరిల్లు వారి’ పేరుతో సొంత నిర్మాణ సంస్థని స్థాపించి స్వీయ దర్శకత్వంలో ‘లాహిరి లాహిరి లాహిరిలో’ చిత్రం చేశారు. విజయం అందుకొన్నారు. ఆ తర్వాత చేసిన ‘సీతయ్య’, ‘దేవదాసు’ చిత్రాలతోనూ తనదైన ప్రత్యేకతని ప్రదర్శించిన వైవీఎస్‌ చౌదరికి ‘ఒక్కమగాడు’, ‘సలీమ్‌’ చిత్రాలు చేదు ఫలితాల్ని ఇచ్చాయి. నిర్మాతగా చేసిన ‘నిప్పు’ కూడా పరాజయాన్నే మిగిల్చింది. సాయిధరమ్‌ తేజ్‌ని ‘రేయ్‌’తో తెరకు పరిచయం చేశారు. కానీ ఆ చిత్రం కూడా పరాజయాన్నే మిగిల్చింది. అప్పట్నుంచి సినిమాలకి దూరంగా ఉంటున్నారు వైవీయస్‌ చౌదరి.

త్వరలోనే ఆయన కొత్త సినిమా కోసం మెగాఫోన్‌ చేతపట్టబోతున్నారని సమాచారం. వెంకట్, చాందిని, చందు, ఆదిత్య ఓం, అంకిత, రామ్, ఇలియానా, సాయిధరమ్‌ తేజ్, సయామీఖేర్‌ తదితర నటుల్ని తెరకు పరిచయం చేసింది చౌదరినే. ‘నిన్నే పెళ్లాడతా’ సమయంలో అందులో ఒక కీలక పాత్రలో నటించిన గీతని ప్రేమించి, ఆమె తల్లిదండ్రుల్ని ఒప్పించి పెళ్లి చేసుకొన్నారు చౌదరి. వీరికి అమ్మాయిలు యుక్త చౌదరి, ఏక్తా చౌదరి ఉన్నారు.

ఈరోజు వైవీయస్‌ చౌదరి గారి పుట్టినరోజు.. వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ..????????????

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

4 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago