బాలీవుడ్ లో ఒకవైపు స్టార్ హీరోయిన్ గా.. మరోవైపు ఐటమ్ గర్ల్ గా ఫుల్ క్రేజ్ తో దూసుకుపోతోంది జాక్వెలిన్ ఫెర్నాండెజ్.. అంతేకాదు ఈ బాలీవుడ్ హాట్ బ్యూటీ ప్రభాస్ హీరోగా నటించిన చిత్రం ‘సాహో’తో తెలుగు ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. ఆ సినిమా అనుకున్నంతగా టాలీవుడ్‌లో విజయం సాధించకపోయినా.. ఆమె కనిపించిన పాటకు మాత్రం మంచి రెస్పాన్సే వచ్చింది.
ఆ సినిమా తర్వాత జాక్వలిన్ పూర్తి స్థాయి తెలుగు చిత్రంలో కనిపించేందుకు రెడీ అయింది. ఆ చిత్రం మరేదో కాదు.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్, క్రియేటివ్ దర్శకుడు క్రిష్, సంచలన నిర్మాత ఏ.ఎమ్. రత్నం కాంబినేషన్‌లో రూపొందుతోన్న పీరియాడికల్ చిత్రం ‘హరిహర వీరమల్లు’. ప్రస్తుతం ఈ చిత్రం కొంత పార్ట్ షూటింగ్‌ని చిత్రీకరణ జరుపుకుంది. పవన్ కల్యాణ్ కరోనాకు గురికావడంతో ఈ చిత్రంతో పాటు, ఆయన చేస్తోన్న మరో చిత్రం ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ షూటింగ్‌కి కూడా బ్రేక్ పడింది.
అంతకుముందు పవన్ ఈ రెండు చిత్రాల షూటింగ్స్‌లో పాల్గొంటూ బిజీబిజీగా గడిపారు. తాజాగా ‘హరిహర వీరమల్లు’ చిత్రం గురించి జాక్వలిన్ తన తాజాగా ఇంటర్వ్యూలో ప్రస్తావించినట్లుగా తెలుస్తోంది.”టాలీవుడ్‌లో ‘హరిహర వీరమల్లు’ అనే చిత్రం చేస్తున్నాను. ఆ చిత్ర షూటింగ్‌లో పాల్గొనేందుకు వెయిట్ చేస్తున్నాను. షూటింగ్స్ సజావుగా సాగి, దర్శకుడు ఎప్పుడంటే అప్పుడు ఆ చిత్ర షూట్‌లో పాల్గొనేందుకు రెడీగా ఉన్నాను.
ఆ మూవీ తర్వాత టాలీవుడ్‌లో మరిన్ని సినిమాలు చేయాలని అనుకుంటున్నాను..” అని జాక్వలిన్ ఈ ఇంటర్వ్యూలో తెలిపింది.. ఇక ఇదిలా ఉంటె ప్రస్తుతం కరోనాతో సినిమా షూటింగ్స్ నిలిచిపోయాయి.. ఈ నేపథ్యంలో ఈ సినిమా దర్శకుడు క్రిష్ మాత్రం నెక్స్ట్ షెడ్యూల్ కి సంబంధించి లొకేషన్స్ ని వెతికే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది.ఇక పరిస్థితులు అన్ని చక్కబడిన తర్వాత బ్రేక్ లేకుండా షూటింగ్ కంప్లీట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట..!!
హైదరాబాద్ ఫిబ్రవరి 19: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ,…
2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…
“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…
తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…
నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…